స్వీట్స్ కొనిస్తామని.. బాలికపై మూడు నెలలుగా గ్యాంగ్ రేప్.. వృద్ధుడు కూడా..

శనివారం, 18 నవంబరు 2017 (13:40 IST)

బాలికలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. పదేళ్ల బాలికపై నలుగురు కామాంధులు మూడు నెలల పాటు అత్యాచారానికి పాల్పడిన ఘటన మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. పదేళ్ల బాలికకు స్వీట్లు ఆశగా చూపి నలుగురు వ్యక్తులు మూడు నెలలుగా పలుమార్లు అత్యాచారానికి ఒడిగట్టారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 
 
మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో ఐదో తరగతి చదువుతున్న బాలికపై.. వాచ్‌మన్‌గా పని చేస్తూ అదే కాలనీలో నివాసం ఉంటున్న నన్హూలాల్‌ (65), మరో ముగ్గురు వ్యక్తులు గోకుల్‌ పన్వాల్‌ (42), గ్యానేంద్ర పండిట్‌ (34), సుమన్‌పాండే (49) గత మూడు నెలల పాటు అత్యాచారానికి పాల్పడ్డారు. నవంబర్ 12 కూడా బాలికపై ఈ నలుగురు అత్యాచారం చేశారు. 
 
అయితే వారి బెదిరింపులకు జడుసుకున్న బాలిక తల్లిదండ్రులకు ఈ విషయాన్ని చెప్పలేదు. కానీ బాలిక ప్రవర్తనలో తేడా గమనించిన ఆమె తల్లిదండ్రులు విషయం తెలుసుకుని షాక్ అయ్యారు. చివరికి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల దర్యాప్తులో స్వీట్లు తీసిస్తామని ఆ బాలికను లొంగ దీసుకున్న దుండగులు.. అనేకసార్లు అత్యాచారానికి పాల్పడ్డారని వెల్లడైంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నలుగురి నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారు.దీనిపై మరింత చదవండి :  
Bhopal Girl Gang Rape Three Months Madhya Pradesh

Loading comments ...

తెలుగు వార్తలు

news

సౌదీ మహారాజు కానున్న ఎంబీఎస్.. ట్రంప్ అభినందనలు

సౌదీ యువరాజు మొహమ్మద్‌ బిన్‌ సల్మాన్‌ అల్‌ సౌదీ (ఎంబీఎస్‌) మహారాజు కానున్నారు. ...

news

నా భార్యకు ఓటేయండి.. లేకపోతే కష్టాలు తప్పవ్: రంజీత్

ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ నేత ముస్లింలను బహిరంగంగా హెచ్చరించారు. ఉత్తరప్రదేశ్ స్థానిక ...

news

చైనాలో ఆశ్చర్యం... ఫోటోలో మాట్లాడిన సత్యసాయి బాబా (వీడియో)

పుట్టపర్తి సత్యసాయి బాబా ఫోటో చైనాలో మాట్లాడుతూ.. కనిపించింది. ఫాంగ్ సూన్ నగరంలోని ...

news

రాత్రిపూట బెంగళూరులో మహిళలు కనపించకూడదు: కర్ణాటక హోం మంత్రి

కొత్త సంవత్సరం సందర్భంగా రోడ్డుపై వెళ్తున్న యువతిపై ఇద్దరు యువకుడు లైంగికంగా వేధించిన ఘటన ...