ఫోన్ కాల్స్ పట్టించుకోలేదు.. యువతిని ఇంట్లోనే బంధించాడు.. రక్తపు మరకలు?

మహిళలపై నేరాలకు పాల్పడేవారిని శిక్షించేందుకు కఠినమైన శిక్షలు లేవు. ఇందుకు చట్ట సవరణ చేయాల్సి వున్న నేపథ్యంలో.. మహిళలపై వయోబేధం లేకుండా వేధింపులు, అత్యాచారాలు, ప్రేమోన్మాదాల దురాగతాలు పెచ్చరిల్లిపోతున్

Selvi| Last Updated: శుక్రవారం, 13 జులై 2018 (18:36 IST)
మహిళలపై నేరాలకు పాల్పడేవారిని శిక్షించేందుకు కఠినమైన శిక్షలు లేవు. ఇందుకు చట్ట సవరణ చేయాల్సి వున్న నేపథ్యంలో.. మహిళలపై వయోబేధం లేకుండా వేధింపులు, అత్యాచారాలు, ప్రేమోన్మాదాల దురాగతాలు పెచ్చరిల్లిపోతున్నాయి. దీంతో మహిళలకు రక్షణ లేకుండా పోతోంది. తాజాగా మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో ఓ అమ్మాయిని గదిలో నిర్బంధించిన యువకుడు కలకలం రేపుతున్నాడు. 
 
స్థానికులు అందించిన సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. యువతిని కాపాడడానికి ప్రయత్నిస్తున్నారు. తాను ఆ యువతిని ప్రేమిస్తున్నానని, వివాహం చేసుకుంటానని కిటికీలోంచి యువకుడు చెప్తున్నాడు. ముంబై నుంచి భోపాల్ వచ్చిన యువతిని వేధించి.. ఆమెను ఫోన్లు చేస్తుండేవాడు, కానీ, రోహిత్ పలుసార్లు ఫోన్ చేసినా యువతి స్పందించకపోవడంతో.. యువతి ఇంట్లోకి చొరబడి ఆమెను నిర్భంధించాడు. మరో గదిలో ఆమె తల్లిదండ్రులను బంధించాడు. ఓ అపార్ట్‌మెంటులోని ఐదో అంతస్తులో ఆ యువతి ఫ్లాట్‌ ఉంది.
 
తన వద్ద ఉన్న స్మార్ట్‌ఫోన్‌తో ఆ యువకుడు పోలీసులతో వీడియో కాల్‌ ద్వారా మాట్లాడాడు. ఫోనులో ఛార్జింగ్ లేదన్నాడు. ఇక ఆ గదిలో యువతి అపస్మారక స్థితిలో పడి ఉంది. మరోవైపు రక్తపు మరకలు కూడా కనపడుతున్నాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. గన్ పాయింట్‌తో బెదిరిస్తున్నాడని, కత్తెరతో యువతిపై దాడికి దిగాడని.. రోహిత్ స్నేహితులు కూడా అతని బారి నుంచి యువతిని కాపాడేందుకు రంగంలోకి దిగారని పోలీసులు చెప్తున్నారు. దీనిపై మరింత చదవండి :