Widgets Magazine Widgets Magazine

బీహార్‌లో నిర్భయ తరహా ఘటన.. మైనర్ బాలికపై ఆరుగురు గ్యాంగ్‌రేప్.. రైలు నుంచి తోసేశారు..

సోమవారం, 19 జూన్ 2017 (17:26 IST)

Widgets Magazine

ఢిల్లీ తరహా నిర్భయ ఘటన బీహార్‌లో చోటుచేసుకుంది. నిర్భయలాంటి యువతులు కామాంధులకు బలైనా కఠినమైన చట్టాలు లేకపోవడంతో చిన్నాపెద్దా లేకుండా మహిళలపై అఘాయిత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. తాజాగా మైనర్ బాలికపై బీహార్ రైలులో సామూహిక అత్యాచారం జరిగింది. ఆపై ఆ బాలికను కామాంధులు రైలు నుంచి తోసేశారు. 
 
శుక్రవారం రాత్రి జరిగిన ఈ ఘోరానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే.. బీహార్ లఖిసరాయ్ జిల్లాలోని లఖోచాక్ గ్రామంలో నివాసం ఉంటున్న 14ఏళ్ల బాలికను నిందితులు అపహరించుకుపోయారు. పొలాల్లో ఆరుగురు ఆ బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. దీంతో అపస్మారక స్థితికి వెళ్ళిపోయిన ఆ మైనర్ బాలిక.. కళ్లు తెరిచి చూసే సరికి రైలులో ఉంది. 
 
కదులుతున్న రైలులో తన ఇంటి పొరుగున ఉండే ఇద్దరు బాలురు తనను రైలు నుంచి కిందకు తోసేశారని బాధితురాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పోలీసులకు తెలిపింది. ఒళ్లంతా గాయాలతో కిలు రైల్వే స్టేషన్ సమీపంలో పడి ఉన్న బాలికను గుర్తించి పాట్నా మెడికల్ కళాశాల ఆస్పత్రిలో చేర్పించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. తీవ్ర రక్తస్రావంతో పాటు, ఐదు చోట్ల పెల్విక్ బోన్ ఫ్రాక్చర్ అయినట్లు వైద్యులు తెలిపారు. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

హైదరాబాదులో ఉద్యోగం.. ఇంట్లో పిండివంటలు చేస్తున్నారు.. ఫోన్‌లో మాట్లాడుతూ.. బీటెక్ విద్యార్థిని?

స్మార్ట్ ఫోన్ల పుణ్యమా అంటూ యువత సెల్ఫీలు, పోస్టులు, లైక్లు, షేర్ల కోసం పాకులాడుతున్నారు. ...

news

లోకేష్ ఆ అమ్మాయిని అటు తీసుకెళ్లబోయాడు.... దూకేసింది...

ఈమధ్య కాలంలో అమ్మాయిలపై హింసాత్మక ఘటనలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. తాజాగా గుంటూరులో మరో ...

news

సరిహద్దుల్లో చేసే యుద్ధం కంటే.. ఏపీలో భూమిని కాపాడుకునేందుకు చేస్తున్న యుద్ధమే కష్టంగా ఉంది!

ప్రభుత్వం కేటాయించిన భూమిని కాపాడుకునేందుకు ఓ మాజీ సైనికుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రెవెన్యూ ...

news

బీజేపీ కురువృద్ధుడి శకం ముగిసినట్టే : రాష్ట్రపతి అభ్యర్థిగా దళితనేత రామ్‌నాథ్ కోవింద్

భారతీయ జనతా పార్టీ కురువృద్ధుడు ఎల్కే.అద్వానీకి మరోమారు శృంగభంగమైంది. ఎన్డీయే కూటమి తరపున ...