శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By IVR
Last Modified: మంగళవారం, 22 జులై 2014 (20:07 IST)

బైక్‌ మీద ప్రవాహాన్ని దాటబోయిన యువకుడు... కానీ ఇలా..!

మధ్యప్రదేశ్ రాష్ట్రంలో భారీ వర్షాలు రెండుమూడు రోజులుగా కురుస్తూనే ఉన్నాయి. ఈ భారీ వర్షాలకు నదులు, వాగులు, వంకలు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. మధ్యప్రదేశ్ బేతుల్ పట్టణం సమీపంలో ఒక రోడ్డు మీద వాగు నీళ్లు పైకి తన్నుకొచ్చాయి. రోడ్డును కోత కోస్తూ వంతెనపైకి నీళ్లు వచ్చేశాయి. రోడ్డు వంతెనపై నుంచి నీటి ప్రవాహం ఉధృతంగా ప్రవహిస్తోంది. ఐతే ఓ యువకుడు ఆ రోడ్డు మీద నుంచి ప్రవాహం మధ్యలోంచి బైక్‌ని నడిపించాలని ప్రయత్నిస్తూ ముందుకెళ్లాడు.
 
ఐతే నీటి ప్రవాహం అంత లోతుగా ఉన్నట్లు కనబడకపోయేసరికి బైకుపై అవతలికి వెళ్లేందుకు అతడు ప్రయత్నించాడు. అయితే, అతడు ఊహించని విధంగా ప్రవాహం మరింత వేగంగా రావడంతో బైకుతో సహా అతడు ప్రవాహంలోకి పడిపోయి కొట్టుకుపోయాడు. అందరూ చూస్తుండగానే అతడు నీటి ప్రవాహంలో కలిసిపోయాడు.