Widgets Magazine

పీకల్లోతు ప్రేమలో ముఖేష్ అంబానీ తనయుడు... డిసెంబరులో పెళ్లి...?

సోమవారం, 5 మార్చి 2018 (09:57 IST)

akash ambani

రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ తనయుడు ఆకాష్ అంబానీ ప్రేమలో మునిగిపోయాడు. ఆయన ప్రేమలో పడింది ఎవరితోనో కాదు.. ప్రముఖ వజ్రాల వ్యాపారి రోజీ బ్లూ డైమండ్స్ అధినేత రసెల్ మెహతా చిన్న కుమార్తె శ్లోకతో. దీంతో వీరిద్దరికి పెళ్లి చేయాలని ఇరు కుటుంబాల పెద్దలు నిర్ణయించినట్టు సమాచారం. డిసెంబరులో వీరి విహాహం జరగనుండగా అతి త్వరలో నిశ్చితార్థం తేదీని ప్రకటించనున్నారు.
 
దీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుకునేటప్పుడు ఆకాశ్, ఒకరినొకరు ఇష్టపడినట్టు సమాచారం. 12వ తరగతి బోర్డు పరీక్షల అనంతరం ఆకాశ్ తన ప్రేమను వ్యక్తపరచగా ఆమె కూడా అంగీకరించిందట. తాజాగా ఇరు కుటుంబ సభ్యులు వారి ప్రేమను అంగీకరించడంతో పెళ్లికి సిద్ధమవుతున్నారు. అయితే, ఈ పెళ్లి వార్తలను ఇరు కుటుంబాలు ఇప్పటివరకు ధ్రువీకరించలేదు.
 
ఆకాశ్ అంబానీ అమెరికాలోని బ్రౌన్ యూనివర్సిటీ నుంచి అర్థ శాస్త్రంలో డిగ్రీ పూర్తి చేశారు. ప్రస్తుతం రిలయన్స్ జియో బోర్డులో కొనసాగుతున్నాడు. శ్లోక ప్రిన్స్‌టన్ యూనివర్సిటీ నుంచి ఆంత్రోపాలజీలో డిగ్రీ, ది లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్ అండ్ పొలిటికల్ సైన్స్ నుంచి న్యాయ విద్యలో లా పూర్తి చేశారు. 2014 నుంచి రోజీ బ్లూ స్వచ్ఛంద సంస్థలో డైరెక్టర్‌గా పని చేస్తున్నారు.


Widgets Magazine
Widgets Magazine

దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

మేఘాలయాలోనూ కాంగ్రెస్‌కు భంగపాటు... బీజేపీ కన్నుసన్నల్లో సర్కారు

ఈశాన్య రాష్ట్రమైన మేఘాలయాలో కాంగ్రెస్ పార్టీకి మరోమారు భంగపాటుఎదురైంది. అచ్చం గోవా ...

news

థర్డ్ ఫ్రంట్‌కు మమతా బెనర్జీ మద్దతు : సీఎం కేసీఆర్

దేశంలో మూడో కూటమి అంటూ ఏర్పాటైతే దానికి తాము సంపూర్ణ మద్దతు ఇస్తామని వెస్ట్ బెంగాల్ సీఎం ...

news

థర్డ్ ఫ్రంట్ ఏర్పాటుపై సంపూర్ణ మద్దతు : పవన్ కళ్యాణ్

తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ సారథ్యంలో ఏర్పాటయ్యే మూడో కూటమికి సంపూర్ణ మద్దతిస్తానని పవర్ ...

news

మేఘాలయా అసెంబ్లీ ఫలితాలు : కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బ తప్పదా?

తాజాగా వెల్లడైన మేఘాలయా అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో 21 సీట్లను కైవసం చేసుకున్న కాంగ్రెస్ ...

Widgets Magazine