మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By TJ
Last Modified: శుక్రవారం, 2 మార్చి 2018 (17:17 IST)

నటి ఖుష్బూని దాంతో కొట్టారు... ఎందుకు?

ప్రముఖ నటి ఖుష్భూపై కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు దాడికి దిగారు. ఆమె ప్రయాణిస్తున్న కారుపై టమోటాలు, గుడ్లను విసిరారు. అంతటితో ఆగలేదు రాళ్ళతో దాడికి దిగడానికి ప్రయత్నించారు. దీంతో ఖుష్భూ డ్రైవర్ వెంటనే గుర్తించి వాహనాన్ని వేగంగా నడుపుతూ వెళ్ళిపోయా

ప్రముఖ నటి ఖుష్భూపై కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు దాడికి దిగారు. ఆమె ప్రయాణిస్తున్న కారుపై టమోటాలు, గుడ్లను విసిరారు. అంతటితో ఆగలేదు రాళ్ళతో దాడికి దిగడానికి ప్రయత్నించారు. దీంతో ఖుష్భూ డ్రైవర్ వెంటనే గుర్తించి వాహనాన్ని వేగంగా నడుపుతూ వెళ్ళిపోయారు. తమిళనాడు రాష్ట్రం మెట్టూరు కోర్టుకు అతి సమీపంలో ఈ సంఘటన  జరిగింది.
 
గత కొన్ని సంవత్సరాలకు ముందు ఖుష్భూ ఒక ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మహిళలను కించపరుస్తూ కొన్ని వ్యాఖ్యలు చేశారు. దీంతో తమిళనాడుకు చెందిన కొంతమంది మహిళలు ఆమెపై మెట్టూరు పోలీస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సుమారు మూడు సంవత్సరాలుగా కేసు నడుస్తూ ఉంది. 
 
కేసు వాయిదాలో భాగంగా కోర్టుకు వెళుతున్న ఖష్భూపై దాడి జరిగింది. తనపై జరిగిన దాడిని ఖష్బూ పెద్దగా పట్టించుకోకపోయినా సినీ ప్రముఖులు మాత్రం పూర్తిగా ఖండిస్తున్నారు. పోలీసులు రంగంలోకి దిగి ఖష్భూపై దాడి చేసిన వారిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.