Widgets Magazine

ఆ రోజు పోలీసులు రాకపోతే అంతా అయిపోయేదే... నమిత ఫ్లాష్‌బ్యాక్

శనివారం, 13 జనవరి 2018 (19:25 IST)

ఇటీవలే తిరుపతిలో తన స్నేహితుడిని పెళ్లాడిన నమిత తాజాగా మీడియాతో మాట్లాడారు. తనంటే అభిమానులు వెర్రెత్తిపోవడమూ, కొందరు గుడి కట్టించడంపై ఆమె మాట్లాడుతూ... వారి మనోభావాలను, ప్రేమను తను ఎంతగానో గౌరవిస్తానని చెప్పారు. తనకు గుడి కట్టించడం పట్ల వారికి తనపట్ల వున్న అభిమానం ఎంతటిదో చెప్పలేనని వెల్లడించారు. ఇకపోతే 2009లో ఓ షాకింగ్ ఘటన జరిగినట్లు చెప్పారు.
Namitha
 
తిరుచ్చిలో ఓ షోలో పాల్గొనేందుకు 2009 అక్టోబరు 23న విమానంలో బయలుదేరి వెళ్లానని వివరించారు. విమానం దిగి బయటకు వెళ్లగానే ఓ వ్యక్తి తన వద్దకు వచ్చి నేను మీ డ్రైవర్ అని చెప్పడంతో నమ్మేసి కారు ఎక్కాననీ, ఐతే సదరు డ్రైవర్ కారును ఏదేదో రూట్లలో తిప్పుతూ వెళ్తుండేసరికి తనకు అనుమానం వచ్చి ఆర్గనైజర్లకు ఫోన్ చేయగా వారు తన కోసం ఇంకా విమానాశ్రయంలో వెయిట్ చేస్తున్నట్లు చెప్పారనీ, దాంతో షాక్ తిన్నట్లు చెప్పారు. 
 
పైగా తనను కారులో తీసుకెళ్తున్న డ్రైవరు తననే అద్దంలో నుంచి గమనించడం చూసి భయపడ్డాననీ, ఇంతలో అతడు తనను ఏదో ఓ గోదాములోకి తీసుకెళ్లాడనీ, అక్కడ మరికొందరు వున్నారనీ, అక్కడి వాతావరణం చూస్తే తనను పెళ్లాడేందుకు ఓ వ్యక్తి సిద్ధంగా వున్నట్లు అర్థమైందన్నారు. ఐతే కారులో ప్రయాణిస్తూనే విషయాన్నంతా ఆర్గనైజర్లకు చెప్పడంతో పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని తనను రక్షించినట్లు చెప్పారు. ఆ రోజు పోలీసులు రాకుండా వుంటే బలవంతంగా అతడెవరో పెళ్లి చేసుకునేవాడేననీ ఆమె గుర్తు చేసుకున్నారు. థ్యాంక్ గాడ్.... సరైన సమయంలో తనను పోలీసులు రక్షించారని అన్నారు.


Widgets Magazine
Widgets Magazine

దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

అవి నన్నే వెతుక్కుంటూ వస్తాయంటున్న మెహరీన్

మహానుభావుడు, రాజా దిగ్రేట్ ఇలా వరుస హిట్లతో దూసుకుపోయింది మెహరీన్. ఇక మెహరీన్‌కు ...

news

నాలుగే పదాలతో బండ్ల గణేష్ ట్వీట్- పవన్‌తో సినిమా చేస్తారా?

పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌పై ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ ఆసక్తికర కామెంట్లు చేశారు. ...

news

తెలుగు ప్రేక్షకులతో సంక్రాంతి సంబరాలు చేయనున్న హీరో సూర్య

సంక్రాంతి కానుకగా సూర్య నటించిన గ్యాంగ్ చిత్రం ప్రేక్షకుల ముందుకు ఈ నెల 12న వచ్చిన సంగతి ...

news

మెగాస్టార్ చిరంజీవి కొత్త లుక్.. మీసాల్లేని సైరా నరసింహారెడ్డి

మెగాస్టార్ చిరంజీవి కొత్త లుక్‌లో కనిపించారు. ఖైదీ 150లో స్టైలిష్‌గా కనిపించి.. యువ ...