శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By PNR

హిందూ ఉగ్రవాదంతోనే ముప్పుపొంచివుందా?: ఆజాద్‌కు బీజేపీ కౌంటర్

హిందూ ఉగ్రవాదంతోనే ముప్పు పొంచివుందంటూ కాంగ్రెస్ నేత గులాం నబీ ఆజాద్ వ్యాఖ్యానించినట్టు వచ్చిన వార్తలపై బీజేపీ మండిపడింది. హిందూ ఉగ్రవాదం అనే పదాలను వాడటంతో కాంగ్రెస్ నేతలు ఆరితేరారని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఆరోపించారు. 
 
ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే హిందూ ఉగ్రవాదాన్ని బీజేపీ తెరపైకి తెచ్చిందంటూ ఆజాద్‌ తాజాగా వ్యాఖ్యానించగా, వీటికి రవిశంకర్ ప్రసాద్ కౌంటర్ ఇచ్చారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ.. 2010లోనే కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ.. హిందూ ఉగ్రవాదాన్ని ప్రస్తావించారని విమర్శించారు. 
 
నాటి అమెరికా రాయబారితో రాహుల్‌ చేసిన వ్యాఖ్యలను ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. 'లష్కర్‌ ఏ తాయిబాకు భారతీయ ముస్లింలు మద్దతు ఇవ్వడం కన్నా హిందూ తీవ్రవాద సంస్థల నుంచే భారత్‌కు ఎక్కువ ముప్పు పొంచి ఉంది' అని రాహుల్‌ ఆరోజున వ్యాఖ్యానించగా, ఈ సంభాషణలను వికీలిక్స్‌ బయటపెట్టిందని రవిశంకర్ గుర్తు చేశారు.