శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By CVR
Last Updated : శనివారం, 5 సెప్టెంబరు 2015 (09:53 IST)

బెంగళూరు విమానాశ్రయానికి కూడా బాంబు బెదిరింపు..

దేశ రాజధాని నగరం ఢిల్లీ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు ఫోన్ కాల్ వచ్చి కొన్ని గంటలు గడవక ముందే మరో మహానగరం బెంగుళూరు విమానాశ్రయానికి కూడా బాంబు బెదిరింపు ఫోన్ కాల్ వచ్చింది. ఢిల్లీలోని అంతర్జాతీయ విమానాశ్రయానికి శనివారం బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో అప్రమత్తమైన అధికారులు మూడు విమానాలను వెనక్కిరప్పించారు. విమానాశ్రయాన్ని, అక్కడ ఉన్న విమానాలను అన్నిటినీ క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు.
 
తాజాగా బెంగుళూరు విమానాశ్రయంలో కూడా శక్తివంతమైన బాంబు పెట్టినట్టు బెదిరింపు ఫోన్ కాల్ వచ్చింది. ఈ నేపథ్యంలో బెంగళూరు విమానాశ్రయం నుంచి బయలుదేరిన పలు విమానాలను వెనక్కి రప్పించిన అధికారులు ముమ్మర సోదాలు చేస్తున్నారు. అయితే బాంబు బెదిరింపులకు పాల్పడింది ఎవరనే విషయం తెలియదని అధికారులు తెలిపారు. ఇది ఆకతాయిలపనా లేదంటే వాస్తవంగానే తీవ్రవాదులైవరైనా బెదిరింపులు చేస్తున్నారా..? అనే దిశగా విచారణ జరుపుతున్నారు. 
 
ఢిల్లీ ఎయిర్ పోర్టుకు ఫోన్ చేసిన గుర్తుతెలియని వ్యక్తే బెంగళూరు ఎయిర్ పోర్టుకూ ఫోన్ చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇదిలా ఉంటే, రెండు ఎయిర్ పోర్టులకు కూడా సౌత్ బెంగళూరు ప్రాంతం నుంచే ఫోన్ కాల్స్ వెళ్లినట్లు పోలీసులు దాదాపుగా నిర్ధారించుకున్నారు. నిందితుడి కోసం బెంగళూరు పోలీసులు తీవ్రంగా గాలింపు చేస్తున్నారు.