శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 6 మే 2016 (15:38 IST)

మహారాష్ట్రలో బీఫ్ తినొచ్చు.. కానీ గోవధ కుదరదు : ముంబై హైకోర్టు

గోడ్డుమాంసం (బీఫ్) భక్షణపై ముంబై హైకోర్టు విచిత్రమైన తీర్పును వెలువరించింది. మహారాష్ట్ర వాసులు ఇతర ప్రాంతాల నుంచి బీఫ్ కొనుగోలు తినొచ్చని పేర్కొంది. అదేసమయంలో మహారాష్ట్రలో మాత్రం గోవధ కదరదని స్పష్టం చేసింది. 
 
గత ఏడాది మహారాష్ట్ర ప్రభుత్వం బీఫ్ వినియోగంపై పూర్తి స్థాయిలో నిషేధం విధించింది. గో మాంసాన్ని అమ్మినా లేక గోవధ చేసినా చట్ట ప్రకారం నేరంగా పరిగణించింది. ఒకవేళ ఆ చట్టాన్ని ఉల్లంఘిస్తే వాళ్లకు అయిదేళ్ల జైలు శిక్షతో పాటు రూ.10వేల జరిమానా విధిస్తున్నట్లు ప్రకటన చేసింది. 
 
విశ్వనగరమైన ముంబైలో గోమాంస వినియోగంపై నిషేధం సరైంది కాదని కోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిని విచారణకు స్వీకరించిన ముంబై హైకోర్టు.. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన ఆవు మాంసాన్ని నిల్వ చేయడం కానీ, తినడం కానీ తప్పుకాదని పేర్కొంటూ తీర్పును వెలువరించింది.