గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 24 అక్టోబరు 2017 (10:14 IST)

వోడాఫోన్ కంపెనీలో లైంగిక వేధింపులు నిజమే... నిర్ధారించిన కోర్టు

దేశంలో టెలికాం సేవలు అందిస్తున్న కంపెనీల్లో ఒకటైన వోడాఫోన్ ఎస్సార్ (ప్రస్తుతం వోడాఫోన్) కంపెనీలో పనిచేసే మహిళలకు రక్షణలేకుండా పోయింది. ఈ విషయాన్ని కోర్టు విచారణ పూర్వకంగా నిర్ధారించింది.

దేశంలో టెలికాం సేవలు అందిస్తున్న కంపెనీల్లో ఒకటైన వోడాఫోన్ ఎస్సార్ (ప్రస్తుతం వోడాఫోన్) కంపెనీలో పనిచేసే మహిళలకు రక్షణలేకుండా పోయింది. ఈ విషయాన్ని కోర్టు విచారణ పూర్వకంగా నిర్ధారించింది. అంతేనా, ఆ కంపెనీలో లైంగిక వేధింపులు జరుగుతున్నప్పటికీ యాజమాన్యం పట్టించుకోలేదని బాంబే హైకోర్టు నిర్ధారిస్తూ, రూ.50 వేల జరిమానాను విధించింది.
 
కంపెనీల్లో అంతర్గత ఫిర్యాదుల పరిష్కారానికి విశాఖ విధివిధానాల ప్రకారం కమిటీని నియమించని వోడాఫోన్‌పై ఈ జరిమానాను విధిస్తున్నామని, ఈ డబ్బు యుద్ధం వితంతువుల అసోసియేషన్‌కు జమ చేయాలని న్యాయమూర్తులు అమ్జాద్ సయ్యద్, ఎంఎస్ కార్నిక్‌లతో కూడిన బెంచ్ తీర్పిచ్చింది. 
 
ఓ మాజీ ఉద్యోగిని వేసిన పిటిషన్‌ను విచారించిన కోర్టు, ఆమెను చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ వేధించాడని, తనకు సహకరించాలని ఒత్తిడి తెచ్చాడని కోర్టు విశ్వసిస్తున్నట్టు న్యాయమూర్తులు పేర్కొన్నారు.