శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : శుక్రవారం, 29 ఆగస్టు 2014 (15:47 IST)

ఘజియాబాద్‌లో ఆడపడుచు భర్తతో భార్యను రేప్ చేయించిన భర్త!

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఘజియాబాద్‌లో మరో దారుణం చోటు చేసుకుంది. కొత్తగా పెళ్లి చేసుకుని తన ఇంటికి తీసుకొచ్చిన భర్త.. ఇంటి ఆడపడుచు భర్తతో తన భార్యపై (కొత్త పెళ్లి కుమార్తె)పై రేప్ చేయించాడు. ఆడపడుచు భర్త తమ గదిలోకి రాగానే కేకలు వేసేందుకు పెళ్లి కుమార్తె ప్రయత్నించగా, భార్య నోటిని భర్త బలవంతంగా నొక్కిపెట్టి అత్యాచారం చేయించాడు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ కేసు వివరాలను పరిశీలిస్తే... ఘజియాబాద్‌లో ఓ యువతికి షాన్ మహ్మద్ అనే యువకుడితో ఇటీవలే వివాహమైంది. పెళ్లి తర్వాత రక్తసంబంధీకుల ఇంటికి వెళ్లే సంప్రదాయం ప్రకారం స్థానిక షహీద్ నగర్‌లో ఉంటున్న ఆడపడుచు ఇంటికి భార్య, భర్త కలసి వెళ్లారు. 
 
అయితే, బాధితురాలు నిద్రిస్తున్న సమయంలో భర్త షాన్ మహ్మద్, ఆడపడుచు రేష్మా సహకారంతో రేష్మా భర్త షంషాద్ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆమె చేసిన ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేసి, నిందితులు ముగ్గురినీ అరెస్టు చేశారు.