Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

పెళ్లికి కొన్ని గంటలే.. ఇంతలో వరుడు రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు.. ఎలా?

బుధవారం, 17 మే 2017 (11:16 IST)

Widgets Magazine
road accident

పెళ్లికి కొన్ని గంటలే మిగిలి వున్నాయి. వరుడు డీసీఎంలో పెళ్ళి మండపానికి బయల్దేరాడు. కానీ ఇంతలోనే లారీ రూపంలో వరుడిని తీసుకెళ్లేందుకు యముడు వెంటనే వచ్చేశాడు. ఫలితంగా రోడ్డు ప్రమాదంలో వరుడు కన్నుమూశాడు.

బుధవారం (నేటి) రాత్రి పెళ్లి జరగనుండడంతో మంగళవారం అర్థరాత్రి దాటాక పెళ్లి బృందం డీసీఎంలో ఖమ్మం బయలుదేరింది. బుధవారం తెల్లవారుజామున ఈ విషాదం చోటుచేసుకుంది. ఈ ఘటనతో ఇరు కుటుంబాల్లో విషాదం అలముకుంది.
 
ఈ ఘటన సూర్యాపేట జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్‌లోని కూకట్‌పల్లికి చెందిన వరుడు సహా కుటుంబ సభ్యులు, బంధువులు కలిసి ఖమ్మం జిల్లా చర్ల మండలంలోని వధువు ఇంటికి డీసీఎంలో బయలుదేరారు. 
 
మార్గమధ్యంలో మోతె గ్రామం వద్ద ఓ పెట్రోలు బంకు సమీపంలో డీసీఎంను ఆపగా, వెనకనుంచి వేగంగా వచ్చిన లారీ డీసీఎంను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వరుడు వెంకటశేషసాయి (21), దామోదర్ (35) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో పదిమంది గాయపడ్డారు. వీరిని కోదాడ ఆస్పత్రికి తరలించారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

సీఆర్‌పీఎఫ్ జవాన్ల ప్రతీకారం : 20 మంది మావోయిస్టులు మృతి

మావోయిస్టులపై సీఆర్‌పీఎఫ్ జవాన్లు ప్రతీకారం తీర్చుకున్నారు. బీజాపూర్‌ జిల్లాలో మంగళవారం ...

news

వాడు తండ్రి కాదు.. పాషాణ హృదయుడు... కుమార్తె చనిపోవడానికి 2 రోజుల ముందు లీగల్ నోటీస్

ప్లీజ్ నాన్నా... నా ఆరోగ్యం క్షీణించిపోతోంది.. ప్రతి రోజూ నరకం అనుభవిస్తున్నా... నన్ను ...

news

కొడనాడు ఎస్టేట్ వాచ్‌మెన్ హత్య కేసులో మరో ట్విస్ట్.. తుప్పుపట్టిన వాహనాలు..

కొడనాడు ఎస్టేట్ వాచ్‌మెన్ హత్య కేసులో అన్నాడీఎంకే చెందిన కవుండంపాళయం ఎమ్మెల్యే ఆరుకుట్టి ...

news

పెళ్లి వేడుకలో డ్యాన్స్ చేయలేదనీ మేడపై నుంచి తోసేసిన భర్త... ఎక్కడ?

ఎంతో సంతోషంతో వివాహ వేడుకకు వెళ్లిన ఓ వివాహిత.. చివరకు శరీరంలోని ఎముకలన్నీ విరిగిపోయి ...

Widgets Magazine