శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : ఆదివారం, 23 అక్టోబరు 2016 (09:59 IST)

దేశం కోసం అమరుడైన మరో జవాను.. చికిత్స పొందుతూ గుర్నాం సింగ్ మృతి

దేశం మరో జవానును కోల్పోయింది. పాక్ రేంజర్ల దాడిలో తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వచ్చిన జవాను గుర్నాం సింగ్ ఆదివారం రాత్రి కన్నుమూశారు. బీఎస్‌ఎఫ్‌ జవాను గుర్నామ్‌ సింగ్‌ (26) కథూవా జిల్లాల

దేశం మరో జవానును కోల్పోయింది. పాక్ రేంజర్ల దాడిలో తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వచ్చిన జవాను గుర్నాం సింగ్ ఆదివారం రాత్రి కన్నుమూశారు. బీఎస్‌ఎఫ్‌ జవాను గుర్నామ్‌ సింగ్‌ (26) కథూవా జిల్లాలో అంతర్జాతీయ సరిహద్దు వద్ద ఉగ్రవాదుల అక్రమ చొరబాటును అడ్డుకున్నారు. దీంతో శుక్రవారం పాకిస్థాన్‌ స్నైఫర్లు అతడిని లక్ష్యంగా చేసుకొని దాడి చేశారు. ఈ దాడిలో జవాను తీవ్రంగా గాయపడ్డారు. 
 
స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ చనిపోయారు. దేశ ప్రజలను కాపాడేందుకు గుర్నాం సింగ్ తన ప్రాణాలను ఫణంగా పెట్టాడని జవాను సోదరుడు మందీప్‌ సింగ్‌ అన్నారు. దేశానికి ఇటువంటి సైనికులే కావాలని గ్రామస్తులు అంటున్నారు.
 
తన సోదరుడిని విదేశాలకు తరలించి వైద్యం చేయాలంటూ గుర్నాం సింగ్ సోదరి ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఓ లేఖ కూడా రాసిన విషయం తెల్సిందే. కానీ, దీనిపై కేంద్రం నుంచి స్పందన రాలేదు. మరోవైపు.. విదేశాలకు తరలించి మెరుగైన వైద్య సేవలు అందిస్తే తమ కుమారుడు బతికేవాడని గుర్నాం సింగ్ తల్లి కన్నీటిపర్యంతమయ్యారు.