శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : మంగళవారం, 3 ఫిబ్రవరి 2015 (16:19 IST)

అత్యాచారాలు నేలపైనే కాదు.. ఆకాశంలో కూడా.. ఏ విమానంలో....!

దేశంలోని యువతులు, మహిళలకు నేలపైనే కాదు... ఆకాశంలో కూడా రక్షణ లేకుండా పోయింది. ఫలితంగా ఒక ప్రైవేట్ సంస్థకు చెందిన విమానంలో ఓ యువతి అత్యాచారానికి గురైంది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ కేసు వివరాలను పరిశీలిస్తే.. 
 
జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన ఓ యువతి ఇండిగో విమానంలో భువనేశ్వర్ ప్రయాణిస్తుండగా, ఆమె వెనుక సీటులో వయసు మీరిన ఓ వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించాడు. సీట్ల మధ్యలో ఉన్న గ్యాప్ నుంచి ఆమెను తాకేందుకు ప్రయత్నించినట్టు సమాచారం. 
 
ఈ విషయాన్ని పసిగట్టిన ఆ యువతి.. అతని ఆకతాయి చర్యలను అడ్డుకునేందుకు ఎంత ప్రయత్నించినా అతను ఆగడం లేదు. దీంతో విసిగిపోయిన ఆమె ధైర్యం కూడదీసుకుని అతని ఫొటోతో పాటు అక్కడ జరుగుతున్న సంఘటనను కొద్దిసేపు వీడియో తీసింది. తర్వాత ఒక్కసారిగా కేకలు వేసింది. ఆమె అరుపులు విన్న విమాన సిబ్బంది, తోటి ప్రయాణికులు ఆ యువతికి అండగా నిలిచారు.
 
దీంతో, జరిగిన సంఘటనపై సహ ప్రయాణికులతో కలిసి ఆమె ఎయిర్ పోర్టు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా, విమానంలో ఈవ్ టీజర్ భువనేశ్వర్‌లోని పలు కంపెనీలకు ఛైర్మన్ అని తెలుస్తోంది. అతడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు, కొంత సేపటి తర్వాత వదిలేయడం గమనార్హం.