Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ఆర్కేనగర్ ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదల.. అన్నాడీఎంకే అభ్యర్థి ఎవరు?

శుక్రవారం, 24 నవంబరు 2017 (16:41 IST)

Widgets Magazine
jayalalithaa

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత మరణంతో ఖాళీ అయిన ఆర్కేనగర్ స్థానానికి ఎన్నికలు జరుగనున్నాయి. ఇది వరకే ఆర్కే నగర్ ఉప ఎన్నికలకు రంగం సిద్ధమైనా... డబ్బులు పంపిణీ, నిబంధల ఉల్లంఘనల వల్ల ఆ ఎన్నికలు రద్దయ్యాయి. అయితే ప్రస్తుతం అన్నాడీఎంకేలో ఓపీఎస్-ఈపీఎస్ వర్గాలు ఏకమైన వేళ.. గురువారం ఎలక్షన్ కమిషన్ రెండాకుల చిహ్నాన్ని వారికే కేటాయించింది. దీంతో శశికళ వర్గానికి చెక్ పెట్టినట్లైంది. 
 
ఈ నేపథ్యంలో శుక్రవారం ఆర్కేనగర్ ఉప ఎన్నికకు ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఆర్కే నగర్ అసెంబ్లీ స్థానానికి డిసెంబర్ 21న పోలింగ్ నిర్వహించి, 24న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నట్లు ప్రకటించింది. గతంలో ఏప్రిల్ 12న ఆర్కే నగర్ ఉప ఎన్నిక జరుగాల్సి ఉండగా.. అధికార ఏఐఏడీంకే పార్టీ నేతలు ఓటర్లకు లంచం ఇచ్చి ప్రలోభపెడుతున్నారన్న ఆరోపణల నేపథ్యంలో వాయిదా పడింది. ఆ తర్వాత మద్రాస్ హైకోర్టు డిసెంబర్ 31లోపు ఆర్కేనగర్ ఉప ఎన్నిక నిర్వహించాలని ఎన్నికల సంఘానికి ఆదేశాలు జారీచేసింది. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం తేదీలను ప్రకటించింది. 
 
ఇక సోమవారం నుంచి నామినేషన్లను స్వీకరించనున్నారు. నామినేషన్ల స్వీకరణకు డిసెంబర్ 4 చివరి తేది. నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ డిసెంబర్ 7గా నిర్ణయించినట్లు ఎన్నికల సంఘం శుక్రవారం వెల్లడించింది. ఈ నేపథ్యంలో అన్నాడీఎంకే, డీఎంకే తరపున బరిలోకి దిగే అభ్యర్థులు ఎవరైవుంటారా? అని ప్రజల్లో ఆసక్తి మొదలైంది. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

వామ్మో... సునామీ వచ్చేస్తుందా? పరుగులు పెట్టిన తీరవాసులు...

సముద్ర తీరంలో సునామీకి సంబంధించి చేపట్టిన మాక్ డ్రిల్ కాస్తా తీర వాసులకు భయభ్రాంతులకు ...

news

స్కైప్, యాపిల్, యూట్యూబ్‌పై చైనా నిషేధం ఎందుకో తెలుసా?

చైనా సర్కారు విదేశీ యాప్‌ల నిషేధంపై వివరణ ఇచ్చింది. విదేశీ ఆన్‌లైన్ కమ్యూనికేషన్ ...

news

యజమాని పెంచుకున్న పావురాల కోసం ప్రాణమిచ్చిన వానరం

పెంపుడు జంతువులు యజమానులపై ఎంతో విశ్వాసాన్ని కలిగివుంటాయనే విషయం తెలిసిందే. అయితే శునకాలు ...

news

పద్మావతికి లింక్.. కోట గోడపై యువకుడి శవాన్ని ఉరేశారా?

పద్మావతి సినిమాపై వివాదాలు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. దేశ వ్యాప్తంగానే కాకుండా ...

Widgets Magazine