శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By CVR
Last Updated : మంగళవారం, 21 అక్టోబరు 2014 (09:25 IST)

దీపావళి తర్వాత బంగారం దిగుమతులపై ఆంక్షలు: అరుణ్ జైట్లీ

దేశంలో బంగారం దిగుమతులతో కరెంటు ఖాతా లోటు పెరిగిపోతుండడంతో దీపావళి పండుగ తర్వాత బంగారం దిగుమతులపై మళ్లీ ఆంక్షలు విధించే అంశంపై పరిశీలించనున్నట్లు కేంద్ర ఆర్థి శాఖ మంత్రి అరుణ్ జైట్లీ పేర్కొన్నారు. ఎంత మేరకు బంగారం ధర పెంచే అవకాశం ఉన్నదనే విషయాన్ని ఆయన చెప్పలేదు.
 
కాగా గత ఏడాది సెప్టెంబర్‌లో 682.5 మిలియన్ డాలర్లుగా ఉన్న బంగారం దిగుమతులు ఈ సంవత్సరం సెప్టెంబర్‌లో ఏకంగా 3.75 బిలియన్ డాలర్లకు పెరిగిన నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. 2012-13లో కరెంటు ఖాతా లోటు (క్యాడ్) రికార్డు స్థాయిలో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో 4.8 శాతానికి పెరగడంతో అప్పట్లో బంగారం దిగుమతులపై ఆర్‌బీఐ ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే.