గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శనివారం, 16 డిశెంబరు 2017 (13:14 IST)

కోల్ స్కామ్ : మాజీ సీఎం మధుకోడాకు జైలుశిక్ష

బొగ్గు కుంభకోణంలో జార్ఖండ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి మధు కోడాకు మూడేళ్ల జైలుశిక్ష, రూ.25 లక్షల జరిమానా విధించింది. ఈ మేరకు ఢిల్లీలోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం శనివారం తీర్పును వెలువరించింది.

బొగ్గు కుంభకోణంలో జార్ఖండ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి మధు కోడాకు మూడేళ్ల జైలుశిక్ష, రూ.25 లక్షల జరిమానా విధించింది. ఈ మేరకు ఢిల్లీలోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం శనివారం తీర్పును వెలువరించింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ హైకోర్టుకు వెళ్లడానికి రెండు నెలల తాత్కాలిక బెయిల్‌ను న్యాయస్థానం మంజూరు చేసింది. 
 
ఇదే కేసులో కోడాతో పాటు కేంద్ర బొగ్గు శాఖ మాజీ కార్యదర్శి హెచ్.సి. గుప్తాకు కూడా మూడేళ్ల జైలు శిక్షతో పాటు లక్షరూపాయల జరిమానా విధించింది. అలాగే, ఇదే కేసులో జార్ఖండ్ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఏకే బసుకి మూడేళ్ల జైలు శిక్ష, కోల్‌కతాకు చెందిన వినీ ఐరన్ అండ్ స్టీల్ ఉద్యోగ్ లిమిటెడ్ (విసుల్) కు రూ.50 లక్షల జరిమానా విధిస్తున్నట్టు ప్రత్యేక న్యాయస్థానం తీర్పునిచ్చింది. బొగ్గు కుంభకోణంకు సంబంధించి మొత్తం 30 కేసులు నమోదు కాగా, అందులో నాలుగు కేసుల్లో తీర్పు వచ్చింది. 
 
జార్ఖండ్‌లోని ఉత్తర రాజ్ హరా బొగ్గు క్షేత్రాన్ని తమకు కేటాయించాలని 2007 జనవరి 8వ తేదీన విసుల్ సంస్థ దరఖాస్తు చేసుకుంది. ఆ సంస్థకు బొగ్గు క్షేత్రం కేటాయించాలని జార్ఖండ్ ప్రభుత్వంగానీ, ఉక్కు మంత్రిత్వ శాఖగానీ మొదట్లో భావించలేదు. స్క్రీనింగ్‌ కమిటీ ఛైర్మన్‌ అయిన గుప్తా ఈ విషయంలో నిజాలను అప్పటి ప్రధాని, బొగ్గు గనుల శాఖ మంత్రి అయిన మన్మోహన్‌ సింగ్‌ వద్ద దాచిపెట్టారని సీబీఐ ఆరోపణలు ఉన్నాయి.