శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : శనివారం, 4 జులై 2015 (12:27 IST)

నాసిక్ 'కుంభమేళా'కు కండోమ్‌ల కొరత : మహారాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ

మహారాష్ట్రలో ఈనెల 14వ తేదీ నుంచి నాసిక్ కుంభమేళా వేడుక ప్రారంభంకానుంది. ఈ కుంభమేళాను విజయవంతం చేసేందుకు మహారాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగమంతా నిమగ్నమైవుంది. ఇందుకోసం ఏర్పాట్లన్నీ సిద్ధం చేశారు. అయితే, కుంభమేళాకు సరిపడ కండోమ్‌లు లేవని మహారాష్ట్ర స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ అంటోంది. దీంతో ఇతర రాష్ట్రాల నుంచి అదనంగా కండోమ్‌లను కుంభమేళా జరిగే ప్రాంతానికి తరలించే పనిలో నిమగ్నమైంది. కుంభమేళా సమయంలో కండోమ్‌లు లేని కారణంగా ఏ ఒక్కరూ ఇబ్బంది పడకూడదన్నదని ఆ సొసైటీ ప్రధానోద్దేశంగా ఉంది. 
 
ఇదే అంశంపై ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ అధికారి ఒకరు మాట్లాడుతూ ‘కుంభమేళా సమయంలో దాదాపు కోటి మంది నాసిక్‌‌కు వస్తారు. చాలా మంది రెండు నుంచి మూడు రోజులు ఇక్కడే ఉంటారు. వారంతా ప్రొటక్షన్ లేకుండా సెక్స్‌లో పాల్గొంటే హెచ్ఐవీ వేగంగా వ్యాపించే అవకాశం ఉంది. ఇక్కడి ఆసుపత్రులలో కండోమ్‌ల నిల్వ లేదు. అందుకే జాతీయ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీతో సంప్రదింపులు జరిపి... అవసరమైన కండోమ్‌లను ఇతర రాష్ట్రాల నుంచి తెప్పించే ప్రయత్నాలు చేస్తున్నట్టు చెప్పారు. 
 
కాగా, అధికారిక లెక్కల ప్రకారం నాసిక్‌లో 2 వేల మంది మహిళా సెక్స్‌వర్కర్లు, 560 మంది పురుష సెక్స్‌వర్కర్లు, 70 మంది ట్రాన్స్‌జెండర్లు ఉన్నారు. ఇక్కడ సాధారణ రోజుల్లోనే నెలకు 1.5 నుంచి 2 లక్షల వరకు కండోమ్‌లు వినియోగం అవుతాయి. కుంభమేళా వంటి ఉత్సవాల సమయంలో వీటి సంఖ్య రెట్టింపు అవుతాయని ఆయన చెపుతున్నారు.