Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ఏపీ డిమాండ్ల సాధన కోసం పార్టీలన్నీ ఏకమవ్వాలి : రాహుల్ గాంధీ

శుక్రవారం, 9 ఫిబ్రవరి 2018 (14:54 IST)

Widgets Magazine
Rahul Gandhi

విభజన కారణంగా తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిమాండ్ల సాధన కోసం అన్ని రాజకీయ పార్టీలు ఏకమవ్వాల్సిన సమయమిది అంటూ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. ఈ మేరకు ఆయన తన అధికారిక ట్వీట్టర్ పేజీలో ఓ ట్వీట్ చేశారు. 
 
"ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక తరగతి హోదా ఇవ్వాలని, పోలవరం ప్రాజెక్టును సత్వరం పూర్తి చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేస్తున్న న్యాయమైన డిమాండ్లకు కాంగ్రెస్ పార్టీ మద్దతిస్తోంది. న్యాయం కోసం అన్ని పార్టీలూ ఏకమవ్వాల్సిన సమయమిది" అంటూ ట్వీట్ చేశారు. 
 
అదేసమయంలో ఏపీ ప్రజలకు ఆయన పూర్తి సంఘీభావం తెలిపారు. న్యాయమైన డిమాండ్లకు పరిష్కారం లభించాలంటే అన్ని పార్టీలూ కలిసికట్టుగా పోరాడాలన్నారు. ఆంధ్రప్రదేశ్ ఎంపీలు పార్లమెంటులో వివిధ రూపాల్లో నిరసన తెలుపుతున్న నేపథ్యంలో ఆయన ట్విటర్ వేదికగా స్పందించారు. 

 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

మా వాళ్లు ఎందుకిలా ప్రవర్తిస్తున్నారో అర్థం కావట్లేదు : అద్వానీ

మిత్రపక్షమైన తెలుగుదేశం పార్టీకి చెందిన ఎంపీలు గత ఐదు రోజులుగా పార్లమెంట్ వేదికగా ...

news

ఆధార్‌ను పుట్టించింది మేమే అంటే నవ్వు రాదా?: రేణుకా చౌదరి

కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి నవ్వుపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పార్లమెంట్‌లో చేసిన ...

news

అన్నంతపని చేసిన కాంగ్రెస్ ఫైర్‌బ్రాండ్ రేణుకా చౌదరి!

తెలంగాణ ఆడబిడ్డ, కాంగ్రెస్ ఫైర్‌బ్రాండ్ రేణుకా చౌదరి అన్నంతపని చేశారు. కేంద్ర మంత్రి ...

news

బాబు పెద్ద తప్పేమీ చేయలేదు.. జైలుకెళ్తే ఓట్లు రాలుతాయ్: ఉండవల్లి

ఏపీ సీఎం చంద్రబాబును జైలుకు పంపితే.. ఏపీ ప్రజలు చూస్తూ ఊరుకోరని కాంగ్రెస్ పార్టీ మాజీ నేత ...

Widgets Magazine