Widgets Magazine

అప్పుడు జీఎస్టీ వద్దు.. ఇప్పుడు మాత్రం ముద్దేముద్దు.. వాటీజ్ ఇట్ మోదీజీ

చెన్నై, శనివారం, 1 జులై 2017 (00:07 IST)

Widgets Magazine
rahul - modi

అధికారంలో ఉన్నప్పుడు ఒక విధంగా, లేనప్పుడు ఒకవిధంగా మాట్లాడితే ప్రధానమంత్రి అయినా సరే ప్రజాకోర్టులో దోషి కావలిసిందే మరి. భారత ఆర్థిక సంవిధానంలో అతిపెద్ద విప్లవంగా ప్రస్తుతం  జీఎస్టీని ఆకాశానికి ఎత్తుతున్న ప్రధాని నరేంద్రమోదీ గతంలో ఆ పెద్ద విప్లవం గురించి ఎంత చేదు వ్యాఖ్య చేశారో తల్చుకుంటే రాజకీయ నేతలను ఎంత మేరకు నమ్మాలి, నమ్మకూడదు అనేది కూడా సందేహమై నిలుస్తుంది. గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నరేంద్రమోదీ అప్పట్లో  జిఎస్టి ఎన్నటికీ విజయవంతం కాదు అని ఘంటాపథంగా ప్రకటించిన క్లిప్పింగులతో కూడిన  వీడియో ఇపుడు నెట్‌లో చక్కర్లు కొడుతోంది.  
 
ఒకే దేశం ఒకే పన్ను అంటూ గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్  విధానం  జీఎస్‌టీ ని  కేంద్రం నేటి ప్రత్యేక పార్లమెంట్‌ అర్ధరాత్రి సమావేశంలో గ్రాండ్‌‌గా లాంచ్‌ చేయనుంది. మరోవైపు  ఈ వేడుకను బాయ్‌ కాట్‌ చేస్తున్నామని ప్రకటించిన  కాంగ్రెస్ జీఎస్‌టీ వ్యతిరేక ప్రచారాన్ని జోరుగా  నిర్వహిస్తోంది. ఇందుకు ఒకపుడు జీఎస్‌టీ విధానాన్ని వ్యతిరేకిస్తూ  ప్రధానమంత్రి  నరేంద్ర మోదీ ప్రసంగాలకు సంబంధించిన వీడియో  క్లిప్పులను సోషల్‌ మీడియాలో షేర్‌  చేసింది.
 
అసంపూర్ణమైన జీఎస్‌టీ వ్యతిరేకించడంతో పాటు,  దేశంలో  పెరుగుతున్న నిరుద్యోగం,   పోలీసుల చేతుల్లో రైతుల కాల్చివేత, ముస్లింలపై దాడులు తదితర కారణాల రీత్యా  ఈ వేడుకలకు దూరంగా ఉండాలని నిర్ణయించినట్టు కాంగ్రెస్‌ ప్రకటించింది.  ఈ నేపథ్యంలో బీజేపీ అమల్లోకి తేనున్న జీఎస్‌టీపై వ్యతిరేక ప్రచారాన్ని ముమ్మరం చేసింది.  ఇందుకు  ఒకపుడు  మోదీ ప్రసంగాలను వాడుకుంటోంది. ముఖ్యంగా  జీఎస్‌టీని తీవ్రంగా వ్యతిరేకిస్తూ   ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాత (గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి) ప్రసంగ క్లిప్లును ట్విట్టర్‌ లో పోస్ట్‌ చేసింది.
 
జిఎస్టి ఎన్నటికీ విజయవంతం కాదు అన్న  వీడియో ఇపుడు నెట్‌లో చక్కర్ లుకొడుతోంది.  అలాగే  జీఎస్‌టీ  అవసరమైన ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండా జీఎస్‌టీ అమలు అసాధ్యమైందంటున్న వీడియో  క్లిప్పులను  కాంగ్రెస్‌ శ్రేణులు విపరీతంగా షేర్‌  చేస్తున్నాయి.  మోదీజీ ఈమాటలను అప్పుడే ఎలా మర్చిపోయారంటూ ఎద్దేవా చేస్తున్నాయి.
 
మరోవైపు విదేశంలో   సెలవులను ఎంజాయ్‌ చేస్తున్న కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాందీ  జీఎస్‌టీ తమాషా అని విమర్శించారు.  సరైన ప్రణాళికలు, దూరదృష్టి , సంస్థాగత సంసిద్ధత లేకుండా జిఎస్‌టీ అమలుచేయడంపై  ఆయన ట్విట్టర్‌లో మండిపడ్డారు.
 
 
INC India ✔ @INCIndia
ji how quickly you forget your own words. Why are you rolling out without developing the proper infrastructure #GSTTamasha
 
 INC India ✔ @INCIndia
This is what Modi ji & the BJP really think of GST #GSTTamashaWidgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

రోజు మనం ఒకరి ముఖాలు ఒకరు చూసుకోవాలి.. సామరస్యంతో కలిసిపోదామన్న వైఎస్ జగన్

వివాదాలను పరిష్కరించడంలో వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ కొత్త బాట పడుతున్నారా? గరగపర్రులో ...

news

అయ్యవారికీ పుట్టింది పాడుబుద్ధి.. బూతు చిత్రాలతో లైంగిక వేధింపులు

పిల్లలకు చదువు చెప్పాల్సిన టీచరే మద పిచ్చి పెరిగి వారికి సెల్‌ఫోన్లో బూతు బొమ్మలను ...

news

తిరుమలలో బాలుడిని అందుకే కిడ్నాప్ చేశాం...(వీడియో)

తిరుమలలో ఈ నెల 14న బాలుడిని కిడ్నాప్ చేసిన వ్యక్తులు తమిళనాడులోని నామకల్‌లో పోలీసుల ఎదుట ...

news

షాకింగయ్యా చంద్రం... కొత్త జీఎస్టీ... కొత్త బాదుడూ....

ఇదివరకు మనం ఓ ప్రకటన చూస్తుండేవాళ్లం. అందులో " అదిరిందయ్యా చంద్రం... కొత్త ఇల్లూ.. కొత్త ...