శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 6 అక్టోబరు 2015 (13:19 IST)

జామా మసీదు జూనియర్ ఇమాం.. హిందూ యువతితో పెళ్లి.. నిజమేది?

ఢిల్లీలోని జామా మసీదు షాహి ఇమామ్ సయ్యద్ అహ్మద్ బుఖారీ కుమారుడు.. జూనియర్ ఇమామ్ షబాన్ బుఖారీ వివాహం వివాదాస్పదమైంది. బుఖారీ ఓ హిందూ యువతిని వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. అమిటీ యూనివర్శిటీ నుంచి గ్రాడ్యుయేషన్ పొందిన షబాన్‌ను గత ఏడాది నవంబరులో జామా మసీదు నయీబ్ ఇమాన్‌గా ప్రకటించారు.

తద్వారా దేశంలోని అతిపెద్ద మసీదైన జామా మసీదుకు అతని తండ్రి తర్వాత ప్రధాన ఇమామ్‌‌గా షబాన్ వ్యవహరిస్తాడు. ఈ నేపథ్యంలో షబాన్ ఓ హిందూ యువతిని వివాహం చేసుకోవాలని నిర్ణయించకున్నట్లు సమాచారం గత రెండేళ్ల పాటు ప్రేమ వ్యవహారం నడిపిన వీరిద్దరి ప్రేమ వ్యహారంపై షబాన్ తండ్రి అభ్యంతరం వ్యక్తం చేశారు. 
 
తొలుత వివాహానికి అంగీకరించని షబాన్ తండ్రి, ఆ అమ్మాయి ముస్లిం మతం స్వీకరిస్తుందని, ప్రస్తుతం ఖురాన్ నేర్చుకుంటున్నదని తెలిసి అంగీకారాన్ని తెలిపారట. ఈ యువతి ఎవరన్న విషయం ఇంకా బయటకు పొక్కనప్పటికీ, నవంబర్ 13న వివాహం నిశ్చయమైందని పలు ఆంగ్ల, హిందీ పత్రికలు వార్తలను ప్రచురించాయి. అయితే ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని షాహీ ఇమామ్, ఆయన కుటుంబ పరువు తీసేందుకే ఇలాంటి వార్తల్ని ప్రచురిస్తున్నారని జామా మసీద్ ఆఫీస్ ఇన్ చార్జ్ అమానుల్లా వెల్లడిచారు.