Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

రెండుసార్లు పెళ్లిచేసుకున్నారు.. అయితే భర్తకు షాక్ ఇచ్చింది.. ఎలా?

ఆదివారం, 8 అక్టోబరు 2017 (16:39 IST)

Widgets Magazine
marriage

ఓ యువతి  ఏడాది వ్యవధిలోనే ఒకే వ్యక్తిని రెండుసార్లు పెళ్లి చేసుకుంది. ఈ ఘటన గుజరాత్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే... అహ్మదాబాద్‌కు చెందిన 26ఏళ్ల యువతి ఫార్మసిస్టుగా పనిచేస్తోంది. మరో ఫార్మసిస్టు, చిన్నతనం నుంచి కలసి చదువుకున్న వ్యక్తిని నవంబర్ 2016లో పెళ్లి చేసుకుంది.

వీరి వివాహం దారయపూర్‌లో రిజిస్టర్ అయ్యింది. అయితే తల్లిదండ్రుల ఒత్తిడి మేరకు ఆ వ్యక్తికి ఈ ఏడాది జూన్‌లో భర్తకు విడాకులు ఇచ్చింది. అయితే, ఈ దంపతులు తల్లిదండ్రుల ఒత్తిడి లెక్కచేయకుండా వారిని ఎదిరించి.. తిరిగి ఆగస్టులో మళ్లీ పెళ్లి చేసుకున్నారు. ఆగస్టు 14న రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు.
 
ఈ దఫా మాత్రం మహిళ తండ్రి ఆ జంట వద్దకు వచ్చి పెళ్లికి అంగీకరించామని, ఇంటికి రావాలని కోరాడు. సెప్టెంబర్ 21న వారింటికి తీసుకెళ్లాడు. అక్కడ  కోపాన్ని చూపించి.. మళ్లీ విడాకులు తీసుకోమన్నాడు. అల్లుడు వినకపోవడంతో గదిలో పెట్టి తాళం వేసి, కుమార్తెను తీసుకుని స్వగ్రామానికి వెళ్లిపోయాడు. 
 
స్థానికుల సాయంతో బయటపడ్డ అతను, 28వ తేదీన హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశాడు. అయితే కోర్టులో భర్తకు ఆమె షాకిచ్చింది. తల్లిదండ్రులతోనే ఉంటానని భర్త తనను సరిగ్గా చూసుకోలేదని చెప్పింది. దీంతో కేసు విచారణను న్యాయమూర్తి వాయిదా వేయగా, తల్లిదండ్రులు బెదిరించి తన భార్యతో ఇలా చెప్పించారని భర్త వాపోయాడు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

పొత్తులపై నోటికొచ్చినట్లు వాగకండి: చంద్రబాబు వార్నింగ్.. తలసాని ఎందుకొచ్చారు?

ఏపీ సీఎం చంద్రబాబుతో టి.టిడిపి నేతల భేటీ ముగిసింది. పొత్తులపై వ్యక్తిగత వ్యాఖ్యలు ...

news

రాజకీయాల్లోకి వస్తే తమిళనాడుకు మంచే చేస్తారు: లతా రజనీకాంత్

తమిళనాడు మాజీ సీఎం జయలలిత మృతికి తర్వాత రాజకీయాల్లో పెనుమార్పులు సంభవించాయి. రజనీకాంత్ ...

news

డొనాల్డ్ ట్రంప్ అక్రమ సంబంధం.. అందుకే తొలి భార్య విడాకులు తీసుకుంది..

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తొలి భార్య ఆయన అక్రమ సంబంధం గురించి ఓ పుస్తకంలో ...

news

ఎన్డీయేతో శివసేన తెగతెంపులు: ఆ నిర్ణయం తీసుకునే సమయం ఆసన్నమైందన్న ఉద్ధవ్?

ఎన్డీయే ప్రభుత్వంతో శివసేన తెగతెంపులు చేసుకోనుందని జాతీయ మీడియాలో వార్తలొస్తున్నాయి. ...

Widgets Magazine