శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pyr
Last Updated : శనివారం, 29 ఆగస్టు 2015 (21:17 IST)

కొరియర్ వ్యాన్‌పై దాడి... కోట్ల విలువ చేసే బంగారు దోపిడీ.. డ్రైవర్ మృతి

అదును చూసి దుండగులు కొరియర్ వ్యాన్‌పై కాల్పులు జరిపారు. అది సాదాసీదా వ్యాన్ కాదు. బంగారు వ్యాన్.. అందులో ఉన్న బంగారు నగలు, బిస్కెట్లు కోట్లాది రూపాయల విలువ చేస్తాయి. వాటిని దుండగులు  లూటీ చేశారు. ఇందులో డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఉత్తరప్రదేశ్‌లో జరిగిన సంఘటన వివరాలిలా ఉన్నాయి. 
 
ఉత్తరప్రదేశ్ ఉన్నవ్ జిల్లాలో లక్నో - కాన్పూర్ జాతీయ రహదారి పక్కనే ఉన్న బజీహెరా గ్రామం సమీపంలోని ఎఫ్ఐ మెడికల్ అండ్ రీసెర్చి సెంటర్ వద్దకు రాగానే దుండగులు వ్యాన్‌పై కాల్పులకు తెగబడ్డారు. ఈ దాడిలో డ్రైవర్‌కు తీవ్ర గాయాలయి అక్కడికక్కడే చనిపోయాడు. సెక్యూరిటీ గార్డుకు తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటనపై వాహనంలోని ఓ వ్యక్తి మాత్రం పోలీసులకు సమాచారం అందించాడు. దాంతో పోలీసులు ఘటన స్థలానికి డ్రైవర్, సెక్యూరిటీ గార్డును సమీపంలోని నవాబ్ జంగ్ కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రానికి తరలించారు. 
 
అయితే అప్పటికే డ్రైవర్ మృతి చెందాడని వైద్యులు తెలిపారు. గార్డు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని... అయితే అతడి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. దాంతో మెరుగైన వైద్య చికిత్స కోసం అతడిని లక్నోలోని ట్రూమా సెంటర్కు తరలించారు. ఈ వాహనం సీక్వెల్ లాజిస్టిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి చెందిందని పోలీసులు చెప్పారు. వ్యాన్లో నగదు అంతా బంగారం బిస్కెట్లు... నగల రూపంలో ఉన్నాయని పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితల కోసం గాలింపు చర్యల కోసం చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.