శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By PYR
Last Modified: సోమవారం, 30 మార్చి 2015 (08:30 IST)

పంటనష్ట పరిహారం పెంచుతాం... అరుణ్ జైట్లీ

రైతులకు సాయం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఎప్పటికీ వెనక్కి పోదనీ, వారిని ఆదుకోవడంలో ముందే ఉంటుందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. విపత్తుల కారణంగా రైతులకు జరిగే నష్టాలను పూడ్చడానికి ఇచ్చే పంటనష్ట పరిహారాన్ని పెంచుతామని ఆయన భరోసా ఇచ్చారు. 
 
ఇటీవలి అకాల వర్షాలతో భారీగా పంటలు దెబ్బతిన్న రాజస్థాన్ బూందీ జిల్లాలోని తిమేలీ గ్రామంలో జైట్లీ ఆదివారం పర్యటించి, రైతులతో మాట్లాడారు. అకాల వర్షాలు, వడగండ్ల వల్ల పంట నష్టపోయిన రైతులకు సహాయం చేసేందుకు పంటనష్ట పరిహార పరిమితిపై రాష్ట్రాలతో చర్చిస్తామని చెప్పారు. 
 
కేంద్రం రైతులకు అన్ని సహాయ సహకారాలు అందిస్తుందని హామీ ఇచ్చారు. అకాల వర్షాలకు అత్యంత ప్రభావితమైన ప్రాంతాల్లో కేంద్ర మంత్రులు పర్యటించాలని ప్రధాని మోదీ ఆదేశించారని చెప్పారు.