శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : గురువారం, 14 మార్చి 2019 (10:54 IST)

ఆస్తి కోసం మామను, భర్తను చితక్కొట్టిన భార్య... రౌడీ షీటర్‌తో కలిసి...

కర్ణాటక రాష్ట్రంలో ఓ వివాహిత తన ప్రియుడైన రౌడీ షీటర్‌తో కలిసి దివ్యాంగుడైన భర్త, అత్తమామలపై దాడి చేసింది. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన వారంతా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆస్తి తన పేరుమీద రాయాలని ఆమె డిమాండ్ చేసింది. దీనికి అంగీకరించక పోవడంతో తన ప్రియుడైన రౌడీషీటర్‌తో కలిసి ఈ దాడికి పాల్పడింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, కేజీహళ్లి ప్రాంతానికి చెందిన గులాబ్‌జాన్‌ అనే వ్యక్తి కుమారుడికి కొద్ది సంవత్సరాల క్రితం అలిస్మా భాను అనే మహిళతో వివాహమైంది. అయితే అదే ప్రాంతానికి చెందిన సమీర్‌ అనే రౌడీషీటర్‌తో అలిస్మాకు వివాహేతర సంబంధం ఏర్పడింది. దీంతో ఆస్తి మొత్తం తమ పేరుపై మార్చాలంటూ మామ గులాబ్‌జాన్‌తో పాటు దివ్యాంగుడైన భర్తపై ఒత్తిడి తెచ్చింది. కానీ అలిస్మా ఒత్తిడికి లొంగలేదు. 
 
దీంతో ఆగ్రహించిన అలిస్మా తన ప్రియుడైన రౌడీ షీటర్ సమీర్‌తో కలిసి దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన గులాబ్‌జాన్ పోలీసుకు ఫిర్యాదు చేసినా వారు ఏమాత్రం పట్టించుకోలేదు. పైగా, గులాబ్‌జాన్‌ సీసీ కెమెరాల ఫుటేజ్‌లతో మీడియాను ఆశ్రయించడంతో ఘటన వెలుగులోకి వచ్చింది. ఇంత జరిగినా పోలీసులు అలిస్మా, రౌడీషీటర్‌ సమీర్‌పై కేసు నమోదు చేసుకోకపోవడం విమర్శలు, పలు అనుమానాలకు తావిస్తోంది.