శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 6 అక్టోబరు 2015 (18:04 IST)

మైనర్ నటిని వేధించిన యాడ్ ఫిల్మ్ డైరక్టర్: సహకరిస్తే బాలీవుడ్ ఛాన్సులు..?

డాక్యుమెంటరీలు, యాడ్ ఫిల్మ్స్‌లో అవకాశాలున్నాయని, తనకు సహకరిస్తే బాలీవుడ్ సినిమాలోనూ అవకాశం కల్పిస్తానని ఓ యాడ్ ఫిల్మ్ డైరక్టర్ ఓ టీనేజ్ అమ్మాయిని వేధించాడు. బాలిక అంగీకరించకపోవడంతో బలవంతం చేశాడు. అసభ్యంగా ప్రవర్తించాడు. వేధించాడు. యూనిట్ నుంచి తీసేస్తానని బెదిరించాడు. అయితే ధైర్యం చేసుకుని తనను వేధించిన వ్యక్తిపై ఆ మైనర్ బాలిక ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 
 
వివరాల్లోకి వెళితే.. న్యూఢిల్లీలో రవీందర్ (47) అనే వ్యక్తిపై ఓ టీనేజీ నటి కేసు పెట్టింది. రవీందర్ లజపత్ నగర్ సమీపంలో నటనలో శిక్షణ ఇచ్చే కేంద్రాన్ని నిర్వహిస్తున్నాడు. ఇతని వద్ద ఓ మైనర్ బాలిక శిక్షణ పొందుతోంది. గత నెలలో షూటింగ్ నిమిత్తం వీరి టీమ్ ఫతేపూర్ బెరీ ప్రాంతానికి వెళ్లగా, ఆ బాలికను వేధించడం మొదలెట్టాడు. తనకు సహకరించాలన్నాడు. 
 
కానీ బాలిక ఒప్పుకోకపోవడంతో వేధించాడు. అయితే ఢిల్లీకి వచ్చాక ఆ బాలిక రవీందర్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు ఐపీసీ మరియు ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రెన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్స్ (పీవోసీఎస్ఓ) చట్టం కింద కేసు నమోదు చేసి కటకటాలకు తరలించారు.