శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : గురువారం, 17 నవంబరు 2016 (13:38 IST)

పెళ్ళిళ్ళకు వెళ్తే.. పాతనోట్లు, చెక్‌లే గిఫ్టులు.. కానుకల్లేవ్.. కొత్త నోట్లు అస్సల్లేవ్..

పెద్ద నోట్లు రద్దు కావడంతో పెళ్ళిళ్లకు వెళ్ళాలంటేనే జనం జడుసుకుంటున్నారు. చేతిలో డబ్బులేకపోవడంతో పాటు.. పాత నోట్లే మార్చుకోలేని పరిస్థితి కనబడుతుండటంతో.. పెళ్ళిళ్లకు వెళ్లే వారు పాతనోట్లనే చదివింపులుగ

పెద్ద నోట్లు రద్దు కావడంతో పెళ్ళిళ్లకు వెళ్ళాలంటేనే జనం జడుసుకుంటున్నారు. చేతిలో డబ్బులేకపోవడంతో పాటు.. పాత నోట్లే మార్చుకోలేని పరిస్థితి కనబడుతుండటంతో.. పెళ్ళిళ్లకు వెళ్లే వారు పాతనోట్లనే చదివింపులుగా ఇచ్చేస్తున్నారు. పెద్ద నోట్ల రద్దుతో పెళ్లి వేడుకలకు ఏదైనా కొని తీసుకెళ్దామంటేనూ, కానుకలు ఇద్దామనుకున్నా నగదు ఉండట్లేదు. దీంతో పెళ్ళికి వెళ్లేవారు కానుకలుగా పాత నోట్లే ఇస్తున్నారు. 
 
మరోవైపు ఆలోచించకుండా పెళ్లి కొడుకు, కూతురికి కట్నకానుకలుగా బ్యాంకు చెక్ లను, పాతనోట్లనే ఇస్తున్నారట. తర్వాత రోజు కట్నకానుకలు చూసుకుంటున్న పెళ్లికొడుకు కుటుంబసభ్యులకు డజన్ల కొద్దీ చెక్స్, రద్దుచేసిన పాత రూ.500 నోట్లు, రూ.1000నోట్లే గిప్ట్‌లుగా దర్శనమిస్తున్నాయట. దీంతో చెక్‌లను తీసుకునేందుకు చాలామంది ముందువెనక ఆలోచిస్తే.. పాత నోట్లనే కానుకలుగా తీసుకుంటున్నారట.