Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

బాయ్‌ఫ్రెండ్స్‌తో మజా చేసేందుకు.. అమ్మమ్మ.. తాతయ్య గదికి నిప్పంటించింది..

శుక్రవారం, 17 మార్చి 2017 (13:54 IST)

Widgets Magazine

బాయ్‌ఫ్రెండ్స్‌తో ఎంజాయ్ చేసేందుకు అమ్మమ్మ, తాతయ్యలు అడ్డుగా ఉన్నారని.. వారిని సజీవదహనం చేసేందుకు రెడీ అయిపోయింది. అమ్మమ్మ, తాతయ్యలను సజీవదహనం చేసేందుకు ప్రయత్నించింది. వారుండే గదికి తాళం వేసింది. ఆపై నిప్పంటించి పారిపోయింది. ఈ ఘటన మైసూరులో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మైసూరులోని లక్ష్మికాంత నగర్ మొదటి స్టేజ్‌లో సోమసుందర్, లీలావతి అనే వృద్ద దంపతులు నివాసం ఉంటున్నారు. వీరి మనవరాలు ప్రియదర్శిని (22). ప్రియదర్శిని మోడల్‌గా పనిచేస్తోంది. 
 
తల్లిదండ్రులు విడాకులు తీసుకోవడంతో పాటు తల్లి ఇటీవలే ఆత్మహత్యకు పాల్పడటంతో అమ్మమ్మ ఇంట్లో ఉంటుంది. అయితే ప్రియదర్శిని బాయ్‌ఫ్రెండ్స్‌తో ఎంజాయ్ చేసేందుకు అమ్మమ్మ, తాతయ్య ప్రతీసారి అడ్డు చెప్తూ వచ్చారు. దీంతో బాయ్‌ఫ్రెండ్స్‌ని తీసుకొచ్చి వారిని చితకబాదేది. అయినా ఆ వృద్ధ దంపతులు వయసు మీదపడిన కారణంగా ఓర్చుకుని ప్రియదర్శినితోనే ఉంటున్నారు. 
 
అయితే ప్రియదర్శిని అంతటితో ఆగకుండా వారిని సజీవదహనం చేసేందుకు యత్నించింది. గురువారం మధ్యాహ్నం అమ్మమ్మ, తాతయ్యలున్న గదికి తాళం వేసింది. నిప్పంటించి.. బయటివారికి తెలిసేలోపు అక్కడి నుంచి పారిపోయింది. వృద్ద దంపతులు గట్టిగా కేకలు వేయడంతో ఇరుగుపోరుగు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అగ్నిమాపక సిబ్బంది, ఇరుగుపోరుగు వారు వచ్చి మంటలు అదుపు చేశారు. 
 
బాధితులను ఆసుపత్రికి తరలించారు. వృద్ద దంపతులు ఆసుపత్రిలో కోలుకుంటున్నారని మైసూరులోని హెబ్బాళ పోలీసులు తెలిపారు. పరారీలో ఉన్న ప్రియదర్శిని కోసం గాలిస్తున్నామని వారు తెలిపారు. ప్రియ డ్రగ్స్ కోసం డబ్బివ్వాలని వృద్ధ దంపతులను తరచూ హింసించేదని, వారు ఇవ్వకపోతే చితకబాదేదని స్థానికులు చెప్తున్నారు. డ్రగ్స్, మద్యానికి బానిసైన ప్రియ తరచూ బాయ్ ప్రెండ్స్‌ని ఇంటికి రప్పించుకునేదని స్థానికులు అంటున్నారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
Mysore Grandparents Somasunder Leelavathi Crime News House Ablaze

Loading comments ...

తెలుగు వార్తలు

news

భూమా బ‌తికి ఉంటే ప‌ల్లెకు 50-50 ఛాన్స్ ఉండేద‌య... ఏంటది?

గత కొంత‌కాలంగా సోష‌ల్ మీడియాలో తొల‌గించ‌బ‌డే మంత్రుల పేర్లలో రాష్ట్ర స‌మాచార‌, ఐటి శాఖ ...

news

'థూ... ఇదేం అసెంబ్లీ...' అమరావతి అసెంబ్లీపై అచ్చెన్న రచ్చరచ్చ?

అమరావతి అసెంబ్లీ భవన సముదాయంపై తొలుత అంతా ఓహో.. ఆహా అన్నారు కానీ ఆ తర్వాత రెండ్రోజులు ...

news

కర్ణాటకలో పవన్ క్రేజ్.. అరుంధతి నక్షత్రానికి బదులు పవన్‌ను ఫ్లెక్సీలో చూసిన కొత్త జంట!

పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌పై అభిమానం హద్దులు దాటుతోంది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో భారీ ...

news

నంద్యాల ఉప ఎన్నికలు.. సీన్లోకి బ్రహ్మానందరెడ్డి.. టీడీపీ అభ్యర్థి రేసులో భూమా చిన్నకుమార్తె కూడా?

దివంగత ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. దీంతో నంద్యాల ఉప ...

Widgets Magazine