శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 21 అక్టోబరు 2016 (16:29 IST)

పాక్ కళాకారులకు డిగ్గీరాజా మద్దతు... పాకిస్థానీ కళాకారులనే ఎందుకు శిక్షించాలి?

పాకిస్థాన్ కళాకారులకు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ మరోమారు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. యురీ ఉగ్రదాడి తర్వాత భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయంతెల్సిందే.

పాకిస్థాన్ కళాకారులకు కాంగ్రెస్ పార్టీ  సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ మరోమారు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. యురీ ఉగ్రదాడి తర్వాత భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయంతెల్సిందే. ఈ ప్రభావం పాకిస్థాన్ కళాకారులపై కూడా పడింది. పాకిస్థాన్‌ కళాకారులు భారత్‌లో పర్యటించకుండా నిషేధం విధించాలన్న డిమాండ్ తెరపైకి వచ్చింది.
 
అదేసమయంలో బాలీవుడ్‌లో క‌ర‌ణ్‌ జొహార్ తెర‌కెక్కించిన ‘ఏ దిల్ హై ముష్కిల్’ చిత్రం విడుదలపై కూడా వివాదం సాగుతోంది. ఈ పరిణామాలన్నింటిపై దిగ్విజయ్ సింగ్ అంశంపై ట్విట్ట‌ర్ ద్వారా స్పందిస్తూ నిర్మాత‌ల విష‌యంలో తాను బాలీవుడ్ వైఖరికి పూర్తి మద్దతు తెలుపుతున్న‌ట్లు చెప్పారు. 
 
పాకిస్థాన్ నుంచి వ‌చ్చే కళాకారులను మాత్ర‌మే ఎందుకు శిక్షించాలని ప్రశ్నించారు. పాకిస్థాన్‌తో ఉన్న ఇత‌ర‌ సంబంధాల‌ను ఎందుకు నిషేధించకూడదు? అని నిలదీశారు. ఇరు దేశాల కళాకారులను ల‌క్ష్యంగా చేసుకోవ‌డం స‌రికాద‌ని సూచించారు. క‌ళాకారులే ఇరు దేశాల వైపులా రాయబారులుగా ఉండ‌గ‌ల‌ర‌ని ఆయన గుర్తు చేశారు.