Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

జిందాబాద్ అనలేదు.. వర్ధిల్లాలి అన్నాడు.. విజయ్ కాంత్ చెంప చెళ్లుమనిపించాడు..

శనివారం, 11 ఫిబ్రవరి 2017 (11:26 IST)

Widgets Magazine

గత ఏడాది ఎన్నికల సందర్భంగా కొంతమంది పాత్రికేయుల మీద ఆగ్రహంతో ఊగిపోయిన డీఎండీకె అధినేత విజయ్ కాంత్.. మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లోకెక్కారు. ఇదే తరహా సీన్ మళ్లీ రిపీట్ అయింది. అయితే ఈసారి డీఎండీకె కార్యకర్త పైనే ఆయన ఆగ్రహంతో ఊగిపోయారు. అంతేకాదు, సదరు అందరిముందు సదరు కార్యకర్త చెంప చెళ్లుమనిపించడంతో అంతా ఒక్కసారిగా షాక్ తిన్నారు. ఇంతకీ ఆ కార్యకర్త చేసిన తప్పిదమేంటంటే.. జిందాబాద్ బదులు వర్ధిల్లాలి అని పలకడమే. జిందాబాద్.. అనకుండా వర్ధిల్లాలి అని పలికిన పాపానికి చెంపచెళ్లుమనిపించారు. 
 
తమిళనాడులోని పెరంబళూరులో శుక్రవారం నాడు డీఎండీకే ఆధ్వర్యంలో నిర్వహించిన 'మీతో నేను' అనే కార్యక్రమంలో విజయ్ కాంత్ ఇలా ప్రవర్తించారు. అప్పటిదాకా కార్యకర్తల సమస్యలకు, ప్రశ్నలకు సమాధానాలు చెప్పిన విజయ్ కాంత్.. కార్యక్రమం ముగిసిన వెంటనే వేదిక దిగి బయటకు నడవడం మొదలుపెట్టారు. ఇంతలో విజయ్‌కాంత్‌కు ఎదురుపడ్డ ఓ కార్యకర్త 'విజయకాంత్ వర్దిల్లాలి' అంటూ గట్టిగా నినదించాడు. దీంతో తీవ్ర ఆగ్రహావేశానికి లోనైన విజయ్ కాంత్ కార్యకర్త చెంప చెళ్లుమనిపించి అక్కడి నుంచి వెళ్లిపోయారు.
 
గత ఎన్నికల సందర్భంగా అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి జయలలిత మళ్లీ గెలుస్తారా? అని ఒక విలేకరి అడిగిన ప్రశ్నపై విజయ్‌కాంత్ భగ్గుమన్నారు. ఇదే ప్రశ్నను జయలలితను అడిగే దమ్ముందా? అంటూనే థూ అని ఉమ్మేశారు. అంతటితో ఊరుకోకుండా జర్నలిస్టులందరూ పిరికివాళ్లని, తమలాంటి వారి వద్దే ప్రగల్భాలు తప్ప వేరేలేదంటూ రుసరుసమన్నారు. ఇంకా కొంతమంది పాత్రికేయుల మీద ఆగ్రహంతో ఊగిపోయిన విజయ్ కాంత్ వారిని చెంపదెబ్బ కొడుతానంటూ వివాదస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
Dmdk Vijayakanth Slaps Party Member

Loading comments ...

తెలుగు వార్తలు

news

చిన్నమ్మకు నో చాన్స్?.. సుప్రీంతీర్పు కోసం గవర్నర్ వేచి చూపులు?

తమిళ రాజకీయం సినిమా ఉత్కంఠను తలపిస్తోంది. ఆ రాష్ట్ర గవర్నర్ సీహెచ్.విద్యాసాగర్ రావు ఏ ...

news

ఫ్లోర్ టెస్ట్ నిర్వహించండి.. ఎవరి బలమేంతో తేలిపోద్ది : గవర్నర్‌కు స్టాలిన్ విన్నపం

తమిళనాడు రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ అనిశ్చితిని తొలగించి ప్రభుత్వ పాలన సాఫీగా సాగేలా ...

news

యూపీ పోల్స్ : ప్రశాంతంగా తొలి విడత పోలింగ్.. 73 సీట్లలో 664 మంది అభ్యర్థుల పోటీ

ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల్లోభాగంగా తొలిదశ ఎన్నికల పోలింగ్ శనివారం ఉదయం ప్రారంభమైంది. ...

news

శశికళ పేరు నెగెటివ్.. పేరు మార్చుకుంటే యోగం తథ్యం.. పన్నీర్ తాత్కాలికమే : ఫేస్ రీడర్

అన్నాడీఎంకే శాసనసభాపక్ష నేతగా ఎన్నికైన ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి వీకే శశికళ ...

Widgets Magazine