శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : బుధవారం, 15 మార్చి 2017 (19:58 IST)

ఆర్కే నగర్ డీఎంకే అభ్యర్థిగా మరుదు గణేష్.. లోకల్ పవరేంటో శశికళకు చూపిస్తా..

ఆర్కే నగర్ డీఎంకే ఈస్ట్ డివిజన్ సెక్రటరీ మరుదు గణేష్‌ను డీఎంకే పార్టీ ఆర్కే నగర్ ఎన్నికల అభ్యర్థిగా ప్రకటించింది. నియోజకవర్గంలోని ప్రతి ఇంటికీ తెలిసిన స్థానిక నేతగా గణేష్‌కు మంచి పేరుంది.

ఆర్కే నగర్ డీఎంకే ఈస్ట్ డివిజన్ సెక్రటరీ మరుదు గణేష్‌ను డీఎంకే పార్టీ ఆర్కే నగర్ ఎన్నికల అభ్యర్థిగా ప్రకటించింది. నియోజకవర్గంలోని ప్రతి ఇంటికీ తెలిసిన స్థానిక నేతగా గణేష్‌కు మంచి పేరుంది. జయలలిత మరణం నేపథ్యంలో ఏప్రిల్ 12న  జరగనున్న ఆర్కే నగర్ బైపోల్ బరిలో అన్నాడీఎంకే అభ్యర్థిగా ఆ పార్టీ డిప్యూటీ ప్రధాన కార్యదర్శి, శశికళ మేనల్లుడు టీటీవీ దినకరన్ నిలబడ్డారు. 
 
మరోవైపు జయలలిత మేనకోడలు దీపా జయకుమార్ మరో అభ్యర్థిలో పోటీ చేస్తోంది. ఈ క్రమంలో ప్రధాన ప్రతిపక్షం డీఎంకే ఎవర్ని రంగంలోకి దింపుతుందనే సస్పెన్స్‌కు తెరపడింది. గణేష్‌ను డీఎంకే బరిలోకి దించింది. ఇక అన్నాడీఎంకే అభ్యర్థి దినకరన్ నాన్ లోకల్ కావడంతో తమకే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయని స్టాలిన్ గట్టిగా నమ్ముతున్నారు.
 
అంతేగాకుండా.. జయలలిత పోటీ చేసినప్పుడే డీఎంకే ఖాతాలో 50 వేల ఓట్లు పడ్డాయని, ఈసారి ప్రత్యర్థులను రికార్డ్ మెజారిటీతో ఓడగొడతామని డీఎంకే అధికార ప్రతినిధి అన్బళగన్ అంటున్నారు. ఆర్కే నగర్‌లో గెలిచి లోకల్ పవరేంటో రుజువు చేస్తానని, శశికళకు సినిమా చూపిస్తానని మరుదు గణేష్ అంటున్నారు. మరోవైపు దినకరన్‌పై పడే ఓట్లు చీల్చేందుకు ఓపీఎస్ కూడా సన్నద్ధమవుతున్నారు. ఆర్కేనగర్ ఎన్నికల్లో అన్నాడీఎంకే తరపున తామే పోటీ చేస్తామని ఓపీఎస్ అంటున్నారు. ఆయనకు రెండాకులు ఇవ్వబోమని చెప్తున్నారు. దీనిపై ఎన్నికల సంఘం వరకు ఓపీఎస్ పోరాడేందుకు రెడీ అయ్యారు.