శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By CVR
Last Updated : సోమవారం, 29 జూన్ 2015 (11:53 IST)

ఐటీఐ ఎంట్రన్స్ పరీక్షల హాల్‌ టిక్కెట్‌లో కుక్క ఫోటో...

పబ్లిక్ పరీక్షలు, ప్రవేశ పరీక్షల సమయంలో అధికారుల నిర్లక్ష్యం కారణగా హాల్‌ టిక్కెట్లలో అభ్యర్థుల పేర్లు మారడం, హాల్ టిక్కెట్ నెంబరు మారడం వంటివి జరుగుతుంటారు. మరీ రేర్‌గా సదరు అభ్యర్థి ఫోటోకు బదులుగా వేరొకరి ఫోటోలు కూడా హాల్ టిక్కెట్‌లలో వస్తుండం జరుగుతుంటాయి. తాజాగా అటువంటి సంఘటన ఒకటి పశ్చిమ బెంగాల్‌లో చోటు చేసుకుంది. అయితే ఈ సారి హాల్ట్‌టిక్కెట్‌లో అభ్యర్థి ఫోటోకు బదులుగా కుక్క ఫోటో కనిపించింది. దీంతో అభ్యర్థి షాక్‌కు గురైయ్యారు.
 
వివరాల్లోకి వెళితే.. పశ్చిమ బెంగాల్‌కు చెందిన సౌమ్యాదిప్ మహతో(18) ఐటీఐ ప్రవేశపరీక్ష కోసం దరఖాస్తు చేసుకున్నాయి. దానికి సంబంధించిన ఎంట్రన్స్ ఆల్ టిక్కెట్‌లో తన ఫోటో స్థానంలో కుక్క బొమ్మను చూసి అవాక్కయ్యాడు. ఈ విషయాన్ని సంబంధిత శాఖకు తెలపడంతో వారు వెంటనే ఫోటోను మార్చి హల్ టిక్కెట్‌ను ఇచ్చారు.
 
ఈ హాల్‌టిక్కెట్‌ను మారుతీ సంస్థకు చెందిన కార్ సర్వీస్ అండ్ రిపెయిర్ ట్రైనింగ్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్స్ మంజూరు చేసినట్లు తెలిసింది. విద్యా శాఖ ఉన్నతాధికారులు దీనిపై విచారణ జరుపుతున్నారు.