శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : సోమవారం, 29 జూన్ 2015 (19:23 IST)

మద్యం సేవించడం ప్రాథమిక హక్కు.. స్టేటస్ సింబల్.. మధ్యప్రదేశ్ మంత్రి బాబూలాల్ గౌర్

మధ్యప్రదేశ్ రాష్ట్ర హోంమంత్రి బాబూలాల్ గౌర్ వివాదాస్పద వ్యాఖ్యలుచేశారు. దేశంలో నేరాలు పెరగడానికి మద్యం సేవించడం ఓ కారణంకాదన్నారు. ఇదే అంశంపై ఆయన సోమవారం మాట్లాడుతూ మద్యం సేవించడం ప్రాథమిక హక్కు అని, పైగా అది స్టేటస్ సింబల్ అని వ్యాఖ్యానించారు. అందువల్ల మద్యపానం కారణంగా క్రైమ్ రేటు పెరగదని సెలవిచ్చారు. 'మద్యం తాగిన తర్వాత మందుబాబులు స్పృహలో ఉండరు. అప్పుడు వారేమీ చేయలేరు. అలాంటప్పుడు క్రైమ్ రేటు పెరగడానికి మద్యం ఎలా కారణమవుతుంది? అని ప్రశ్నించారు. 
 
గతంలో కూడా ఆయన మహిళల వస్త్రాధారణపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెల్సిందే. తమిళనాడులోని మహిళలు నిండుగా దుస్తులు ధరిస్తారని, అందుకే, ఇతర రాష్ట్రాలతో పోల్చితే తమిళనాడులో మహిళలపై అఘాయిత్యాలు చాలా తక్కువని అభిప్రాయపడ్డారు.