శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 3 జులై 2018 (12:29 IST)

వధువును పైకెత్తిన వ్యక్తి.. దించగానేలాగి ఒక్కటిచ్చిన పెళ్లి కుమార్తె

ఆ కళ్యాణ మండపమంతా సందడి సందడిగా ఉంది. వధువు మెడలో మూడుముళ్ళు కూడా పడ్డాయి. ఆ తర్వాత వధూవరులిద్దరూ ఒకరిమెడలో ఒకరు వరమాలలు వేసుకోవాల్సివుంది. ఆ సమయంలో వరుడుని మరో వ్యక్తి పైకెత్తాడు. దీంతో వరుడు మెడలో వ

ఆ కళ్యాణ మండపమంతా సందడి సందడిగా ఉంది. వధువు మెడలో మూడుముళ్ళు కూడా పడ్డాయి. ఆ తర్వాత వధూవరులిద్దరూ ఒకరిమెడలో ఒకరు వరమాలలు వేసుకోవాల్సివుంది. ఆ సమయంలో వరుడుని మరో వ్యక్తి పైకెత్తాడు. దీంతో వరుడు మెడలో వధువు మాల వేయలేక పోయింది. ఎత్తు అందక పోవడంతో నిల్చుండిపోయింది.
 
ఇంతలో ఓ వ్యక్తి వచ్చి వధువును పైకెత్తడంతో వరుడు మెడలో ఆమె మాల వేసింది. ఆ తర్వాత వరుడు కూడా మాల వేశాడు. ఈ వరమాలల వేసిన తర్వాత వధువును కిందికి దించాడు. అంతే... తనను పైకెత్తిన వ్యక్తిని వధువులాగి ఒక్కటిచ్చింది. ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలియదు కానీ.. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు వైరల్‌గా మారింది. 
 
వధువు, వరుడు దండలు మార్చుకునేందుకు నిలబడిన వేళ, వరుడిని అతని బంధువు ఒకరు పైకి ఎత్తి నిలబడ్డాడు. వధువు బంధువులు ఎవరైనా ఆమెను అంతకన్నా పైకి లేపి వరమాల వేయించడం సంప్రదాయం. అక్కడా అదే జరిగింది. వధువును పైకి ఎత్తి వరమాల వేయించిన బంధువును, కిందకు దించగానే లాగి పెట్టి ఒక్కటిచ్చిందా అమ్మాయి. ఆపై అతన్ని తిట్టింది కూడా. ఇక అవమానంభతో కుంగిపోయిన ఆయన, పక్కనే ఉన్న మరో యువతిని లాగి కొట్టి, అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఆ వీడియోను మీరూ చూడండి.