జయ స్నేహితురాలి శశికళ బినామీ ఆస్తుల జప్తుకు రంగం సిద్ధం

ఆదివారం, 29 అక్టోబరు 2017 (11:17 IST)

sasikala

ఆదాయానికి మించి ఆస్తుల సంపాదన కేసులో దోషిగా తేలి బెంగళూరులోని పరప్పణ అగ్రహార జైలులో శిక్ష అనుభవిస్తున్న అన్నాడీఎంకే మాజీ ప్రధాన కార్యదర్శి వీకే శశికళ బినామీ ఆస్తుల జప్తునకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు కేంద్రం చర్యలు చేపట్టింది. 
 
నల్లధనాన్ని అరికట్టే చర్యల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం అనేక రకాలైన చర్యలు చేపడుతోంది. ఇందులోభాగంగా దేశంలో పెద్ద విలువ కలిగిన నోట్లను రద్దు చేసింది. అలాగే, నకిలీ కంపెనీల జాబితాను కూడా తయారు చేసింది. ఇలా తయారు చేసిన జాబితాలో దేశంలో మూడు లక్షల నకిలీ కంపెనీలు ఉన్నట్టు గుర్తించింది. 
 
ఈ కంపెనీల పేరిట పలువురు రూ.1.321 లక్షల కోట్లు డిపాజిట్ చేసినట్టు ఇటీవల గుర్తించిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) వీటిలో 2.2 లక్షల కంపెనీల గుర్తింపును రద్దు చేసింది. అంతేకాక ఆయా కంపెనీలకు డైరెక్టర్లుగా ఉన్న వారిపై ఐదేళ్ల నిషేధం విధించింది. ఈ కాలంలో వీరు ఇతర కంపెనీల్లో ఆర్థిక లావాదేవీలు నిర్వహించకుండా ఆంక్షలు విధించింది.
 
ఇలా నిషేధం విధించి వారి జాబితాలో శశికళ కూడా ఉన్నారు. ఆమె నకిలీ కంపెనీల్లో ఫ్యాన్సీ స్టీల్స్, రెయిన్‌బో ఎయిర్, సుక్రా క్లబ్, ఇండో-దోహా పెట్రో కెమికల్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్ తదితర కంపెనీలున్నాయి. వీటి ఆస్తులను గుర్తించాల్సిందిగా ఆదేశించిన కేంద్రం వాటి స్వాధీనానికి రంగం సిద్ధం చేసినట్టు తెలుస్తోంది.దీనిపై మరింత చదవండి :  
Sasikala Ed Assets Properties Tamilnadu Jail

Loading comments ...

తెలుగు వార్తలు

news

బాబూ... ఇక ఇక్కడ చాలు... ఇదిగో నా రాజీనామా... రేవంత్ రెడ్డి

గత కొన్ని రోజులుగా తెలంగాణ తెలుగుదేశం పార్టీలో తీవ్రస్థాయి చర్చకు తెరలేపిన రేవంత్ రెడ్డి ...

news

ఆ వేలి ముద్ర జయలలితతే .. హైకోర్టులో ప్రభుత్వ వైద్యుడు

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత జీవించివున్న సమయంలో అన్నాడీఎంకే బీఫామ్ పత్రాలపై వేసిన ...

news

అత్యాచారాన్ని చిత్రీకరించి షేర్ చేయడం దారుణం... నన్నపనేని

మహిళా కమీషన్ చైర్ పర్సన్ నన్నపనేని రాజకుమారి మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై ఆవేదన, ...

news

నారాయణ విద్యా సంస్థలు వర్సెస్ చైతన్య విద్యా సంస్థలు, కలిసి పనిచేయలేం...

తెలుగు రాష్ట్రాల్లోని కార్పొరేట్ కళాశాలలు కొట్టుకుంటున్నాయా అంటే అవుననే అనాల్సి వస్తోంది. ...