శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , శుక్రవారం, 10 మార్చి 2017 (02:43 IST)

నిజంగానే నాలుగు రాష్ట్రాల్లోనూ బీజేపీ గెలిస్తే కేంద్ర మంత్రులందరినీ మోదీ గోడకుర్చీ వేయించడం ఖాయం

అయిదు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరగ్గా, వాటిలో నాలుగు బీజేపీ పరం కానున్నాయని ఎగ్జిట్ పోల్స్ తేల్చేసిన తరుణంలో బీజేపీలో సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. కార్యకర్తల్లో కోలాహలం చెప్పనవసరం లేదు. కానీ బీజేపీ సీనియర్ మంత్రుల్లో అప్పుడే దడ పుట్టిందని వార్తల

అయిదు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరగ్గా, వాటిలో నాలుగు బీజేపీ పరం కానున్నాయని ఎగ్జిట్ పోల్స్ తేల్చేసిన తరుణంలో బీజేపీలో సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. కార్యకర్తల్లో కోలాహలం చెప్పనవసరం లేదు. కానీ బీజేపీ సీనియర్ మంత్రుల్లో అప్పుడే దడ పుట్టిందని వార్తలు. ఎన్నికల్లో అవకాశాలు సగం సగంగా ఉన్నప్పుడే మోదీ పెత్తనాన్ని, దాష్టీకాన్ని తట్టుకోలేకపోతున్న కేంద్ర మంత్రులు ఎగ్జిట్ పోల్స్ ఫలితాల నేపథ్యంలో హతాశులయ్యారని తెలుస్తోంది. కారణం.. బీజేపీ గెలిచినా, ఓడినా అది మోదీ ప్రభావమే అని అందరికీ తెలుసు. అరుణ్ జైట్లీని, వెంకయ్య నాయుడిని, తదితర మూరెడు, బారెడు మంత్రులను, నేతలను మొహాలు చూసి ప్రజలు బీజేపీకి ఓట్లేస్తారంటే అంతకన్నా హాస్యాస్పదమైన విషయం మరొకటి లేదు. మంచికైనా, చెడుకైనా ఆపద్బాంధవుడు నమోనే అంటే నరేంద్రమోదీనే అని తేలిపోయింది కాబట్టి అయిదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో గెలువు, ఓటమి కూడా మోదీ ఖాతాలోకే వెళుతుంది.
 
ఇంతవరకు బాగానే ఉంది. కానీ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు బీజేపీకి అనుకూలంగా వచ్చినట్లే అసలు ఫలితాలు కూడా ఆమార్గంలోనే వెళితే కేంద్ర ప్రభుత్వంలోని మంత్రుల పలిస్థితి దారుణంగా మారుతుందని పరిశీలకులు భావిస్తున్నారు. ఇంతవరకు భారత రాజకీయ చరిత్రలో ఏ ప్రధానమంత్రీ నరేంద్ర మోదీ అంత దాష్టీకాన్ని, పెత్తనాన్ని చలాయించలేదన్నది స్వయంగా బీజేపీ నేతలే చెబుతున్నారు. ప్రధాని కాగానే కేబినెట్ మంత్రులతో సమావేశమైన మోదీ తాను కుర్చీలో కూర్చుని ఒక్కొక్క మంత్రినీ లేపి మరీ నీ చరిత్ర, నీవు సాధించినవి ఏవయినా ఉంటే చెప్పు అంటూ నిలబెట్టి మాట్లాడించిన ఫోటోలు విదేశీ మీడియాలో చూసినప్పుడు కానీ మోద పాలనా శైలి, వ్యవహారం, అహంభావం అర్థంకాలేదు. 
 
ఆ తర్వాత పెద్ద నోట్ల రద్దు సందర్భంగా కేబినెట్‌ను సమావేశ పర్చిన మోదీ విషయం చెప్పి ఎవరూ గంటపాటు ఇక్కడి నుంచి కదలొద్దని ఆదేశించి కేబినెట్ మొత్తాన్ని ఆ గదిలోనే ఉంచి తలుపులు మూయించి మరీ మీడియాతో మాట్లాడిన తర్వాతే మంత్రివర్గానికి విముక్తి కల్పించారు. తన ప్రకటన ముగిసేవరకు మంత్రులు వద్ద మొబైల్ పోన్లను కూడా లాక్కుని భద్రపర్చిన  మోదీ ఆధిపత్య ధోరణి సీనియర్ మంత్రులకే కంపరం పుట్టించినా ఎవరూ నోరెత్తలేని పరిస్థితి. అలాంటిది మళ్లీ ఈ దఫా అసెంబ్లీ ఎన్నికల్లోనూ మోదీ ప్రభావమే బీజేపీని గెలిపిస్తే మొత్తం కేబినెట్ మోదీ ముందు ముంగాళ్లపై నిలబడుకోవాల్సిందేనని తేలుతోంది. 
 
అయితే ఈ ఫలితాలు మోదీకి అనుకూలంగా మారితే మోదీ ఇమేజ్ ఎక్కడికో పోతుందనేది ఖాయం. ఎలాగో చూద్దాం. ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో నాలుగు బీజేపీకే వరం కాబోతున్నాయని  ఎగ్జిట్ పోల్స్ తేల్చేశాయి. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖాండ్, గోవా, మణిపూర్ లలో హంగే వీస్తుందంటూ ఎగ్జిట్ పోల్స్ ప్రకటించాయి. దీంతో ఈ గెలుపు క్రెడిటంతా ప్రధాని మోదీకే దక్కబోతుందని వెల్లడవుతోంది. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ తొలిసారి కమలం తన కిరీటాన్ని  ఎగురవేయడం  మోదీ ఇమేజ్ ను మరింత పెంచబోతున్నాయట. ప్రభుత్వాన్ని ఆయన మరింత కంట్రోల్ లో పెట్టడానికి కూడా ఈ ఫలితాలు దోహదం చేయనున్నాయని వెల్లడవుతోంది. ఢిల్లీలో మరోసారి పాగా వేసేందుకు కూడా ఉత్తరప్రదేశ్ గెలుపు ఎంతో సహకరించనుందని తెలుస్తోంది. నాలుగు రాష్ట్రాల్లో  బీజేపీ గెలుపుతో మోదీకి, ఆయన ప్రభుత్వానికి వచ్చే లాభాలేమింటో ఓ సారి చూద్దాం....
 
బీజేపీ విక్టరీ ప్రధాని మోదీ  పాపులారిటీని మరింత పెంచుబోతున్నాయి. ముఖ్యంగా డీమానిటైజేషన్ లాంటి పాలసీల అమలుకు  ఈ ఎన్నికల గెలుపు ఎంతో సహకరించనుంది. వచ్చే లోక్ సభ ఎన్నికలకు మోదీ తన ప్రాబల్యంతో బీజేపీ గెలుపు దిశగా పయనించనున్నారు. రాజ్యసభలో తన సీట్ల పెంపుకు కూడా ఈ నాలుగు రాష్ట్రాల విక్టరీ కీలకంగా మారనుంది. ఇన్నిరోజులు రాజ్యసభలో మైనార్టి సభ్యులున్న పార్టీకి, బిల్లుల పాస్ క్లిష్టమయ్యేంది. ఈ గెలుపు రాజ్యసభలో మెజార్టి, తన పాలసీ అమలుకు సులభతరం కానుంది.  మరోవైపు అగ్రకులాల పార్టీగా పేరున్న బీజేపీ, ఉత్తరప్రదేశ్ లో గెలవడం కష్టమేనని ఇన్నిరోజులు భావించేవారు. కానీ ఆ అభిప్రాయాన్ని మార్చివేస్తూ నాన్-యాదవ్ ఓబీసీ, నాన్-జటావ్ దళితులతో పొత్తుపెట్టుకునేందుకు ఈ ఎన్నికలు సహకరించాయి. ఎస్పీ, బీఎస్పీలకు ఓటు బ్యాంకుగా ఉన్న  ఆ ఓట్లను బీజేపీ కొల్లగొట్టింది. ప్రధాని మోదీ కొత్త స్ట్రాటజీ గెలుపుకు ఈ ఎన్నికల విజయంగా ఒకటిగా పరిమళించబోతుంది. 
 
టాగ్లు: Exit poll results, victory, PM Modi, ఎగ్జిట్ పోల్స్, విక్టరీ, ప్రధాని మోదీ