Widgets Magazine

టెక్కీని మోసం చేసిన దొంగ బాబా.. గతజన్మలో నేనే నీ భర్త..

సాంకేతికత ఎంత పెరిగినా.. ఉన్నత చదువులు చదివినా.. బాబాలను నమ్మి మోసపోవడం ప్రస్తుతం ఫ్యాషనైపోయింది. తాజాగా ఓ టెక్కీ దొంగ బాబా చేతిలో మోసపోయింది. మహారాష్ట్ర, థానేలో ఈ ఘటన చోటుచేసుకుంది.

fake baba
selvi| Last Updated: శుక్రవారం, 17 నవంబరు 2017 (14:31 IST)
సాంకేతికత ఎంత పెరిగినా.. ఉన్నత చదువులు చదివినా.. బాబాలను నమ్మి మోసపోవడం ప్రస్తుతం ఫ్యాషనైపోయింది. తాజాగా ఓ టెక్కీ దొంగ బాబా చేతిలో మోసపోయింది. మహారాష్ట్ర, థానేలో ఈ ఘటన చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్ర థానేలో సైలాస్ జోథియా అనే బాబా వుండేవాడు. అతడు గత జన్మలు గురించి చెప్పడం.. వ్యాధులను నయం చేయటాన్ని అలవాటుగా పెట్టుకునేవాడు. తద్వారా అతడు చేసే సేవలకు మూడు లక్షలు తగ్గకుండా వసూలు చేసేవాడు. ఇతని వద్దకు వచ్చి ఓ టెక్కీని కూడా ఇదే తరహాలో మోసం చేశాడు. గత జన్మలో తాను టెక్కీ భర్తనని.. ఆదర్శ దంపతులుగా జీవించామని చెప్పాడు. దీన్ని కూడా ఆమె గుడ్డిగా నమ్మింది.

అంతేగాకుండా ఆమె తండ్రి అనారోగ్యం పాలైతే నయం చేస్తానని చెప్పాడు. కానీ తండ్రి ఆరోగ్యం మెరుగుపడకపోవడంతో బాబాకు టెక్కీ దూరమైంది. అయినా బాబా ఆమెను వదిలి పెట్టకుండా ఓ సీడీని పంపి రూ.10లక్షలు డిమాండ్ చేశాడు. దీంతో టెక్కీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దొంగ బాబాను అరెస్ట్ చేశారు.


దీనిపై మరింత చదవండి :