Widgets Magazine

పార్టీలో శశికళ వాసనే ఉండకూడదు... మా ధర్మయుద్ధానికి తొలి విజయమిది: మాజీ సీఎం పన్నీర్

గురువారం, 20 ఏప్రియల్ 2017 (09:23 IST)

Widgets Magazine

అన్నాడీఎంకే నుండి దివంగత జయలలిత ప్రియనెచ్చెలి శశికళతో పాటు.. ఆమె కుటుంబం దూరంకావడం తాము చేస్తున్న ధర్మయుద్ధానికి లభించిన తొలి విజయమని మాజీ ముఖ్యమంత్రి పన్నీర్‌ సెల్వం అన్నారు. అన్నాడీఎంకే ఉప ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్‌ పార్టీ నుంచి వైదొలుగుతున్నట్టు ప్రకటించడంపై ఆయ
opanneerselvam
న సంతోషం వ్యక్తం చేశారు. 
 
బుధవారం ఉదయం తన నివాసం వద్ద ఆయన మాట్లాడుతూ జయ మృతి తర్వాత పార్టీని కబళించిన శశికళ, ఆమె కుటుంబీకులను తరిమికొట్టేంతవరకూ తన పోరాటం ఆగదని గతంలో ప్రకటించానని, ఇప్పుడా లక్ష్యం నెరవేరిందని అన్నారు. పార్టీలో రెండు వర్గాల విలీనానికి అనువుగా చర్చలు జరుపుతామన్నారు.
 
అన్నాడీఎంకేలో శశికళ కుటుంబం పెత్తనం సరికాదని, పార్టీ నిబంధనలకు వ్యతిరేకంగా ప్రస్తుతం కార్యక్రమాలు సాగుతున్నాయని, ఆ కుటుంబాన్ని పార్టీ నుంచి తొలగించేవరకు ధర్మయుద్ధాన్ని కొనసాగిస్తానని గతంలోనే చెప్పానన్నారు. ఆ ప్రకారం అన్నాడీఎంకే (అమ్మ) వర్గం నుంచి దినకరన్‌ కుటుంబాన్ని దూరంగా పెడుతున్నామని ప్రకటన రావడం తమ ధర్మయుద్ధంలో తొలి విజయమన్నారు. 
 
ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి, అన్నాడీఎంకే(అమ్మ) వర్గంతో చర్చల అనంతరం ప్రజలకు ప్రయోజనకరమైన నిర్ణయం తీసుకుంటామన్నారు. మాజీ ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం ఈ ఏడాది ఫిబ్రవరి 7న శశికళ వర్గంపై తిరుగుబాటు బావుటా ఎగరవేయడంతో అన్నాడీఎంకేలో చీలిక వచ్చిన విషయం తెలిసిందే. 
 
మంగళవారం రాత్రి రాష్ట్ర ఆర్థిక మంత్రి డి.జయకుమార్‌ కీలక ప్రకటన నేపథ్యంలో అన్నాడీఎంకే నుంచి టీటీవీ దినకరన్‌ కుటుంబం బయటకు వెళ్లిపోయినట్లయింది. దీంతో పన్నీర్‌సెల్వం ప్రధాన డిమాండ్‌ను మన్నించినట్లవడంతో ఇరువర్గాల మధ్య విలీన చర్చలకు తెరలేచింది.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

చెంపలపై కొట్టి.. చున్నీతో మెడబిగించి హత్య చేసిన భర్త... ఏమీ తెలియనట్టుగా కేకలు..

కట్టుకున్న భార్యపై అనుమానం పెంచుకున్న కసాయి భర్త... ఆమెను కొట్టి చంపిన ఘటన ఒకటి ...

news

అన్నాచెల్లెళ్ళట.. ప్రేమించుకున్నారట.. నగ్నంగా నడి వీధుల్లో నడిపించిన గ్రామ పెద్దలు

ఓ గ్రామ పంచాయతీ పెద్దలు మానవత్వానికి మాయని మచ్చలా నిలిచిపోయేలా తీర్పునిచ్చింది. ...

news

కట్నం కోసం నిండు గర్భిణిని కాల్చేశారు.. మృగంలా మారిన భర్త...

తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లాలో ఓ దారుణం జరిగింది. కట్నం కోసం నిండు గర్భిణిని ...

news

అమెరికాలో ఉ.కొరియా బాంబు.. అగ్రనగరాలు ధ్వంసం.. కాలిబూడిదైన వైట్‌హౌస్ జెండా... వీడియో

అగ్రరాజ్యం అమెరికాతో యుద్ధానికి ఉత్తర కొరియా సై అంటోంది. తాజాగా మరో కవ్వింపు చర్యకు ...