Widgets Magazine

దాణా కేసు: లాలూ ప్రసాద్‌కు మూడున్నరేళ్ల జైలు.. నో-బెయిల్

శనివారం, 6 జనవరి 2018 (16:37 IST)

Lalu

దాణా కుంభకోణం కేసులో ఆర్జేడీ అధినేత, బీహార్ మాజీ ముఖ్య‌మంత్రి లాలూ ప్రసాద్‌కు‌ జైలు శిక్ష ఖరారైంది. ఈ మేరకు రాంచీ సీబీఐ కోర్టు లాలూ ప్రసాద్ యాదవ్‌కు మూడున్నరేళ్ల జైలు శిక్షను విధించింది. లాలూతో పాటు ఏడుగురు నిందితులకు కూడా ఇదే శిక్షను ఖరారు చేసింది. అంతేగాకుండా రూ.5లక్షల జరిమానా కూడా విధించింది. మూడేళ్లు జైలు దాటడంతో లాలూ ప్రసాద్‌ యాదవ్‌కు బెయిల్ ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. 
 
దాదాపు 21 ఏళ్ల పాటు సుదీర్ఘంగా కొన‌సాగిన దాణా కుంభకోణం కేసులో దోషుల‌కు శిక్ష ఖరారు చేసింది. ఈ కేసులో లాలూతో పాటు 15 మందిని రాంచీ సీబీఐ కోర్టు దోషులుగా తేల్చింది. కొన్ని రోజుల పాటు కస్టడీలో వున్న వీరంతా.. ప్ర‌స్తుతం బిర్సా మండా సెంట్ర‌ల్ జైలులో ఉన్నారు. 
 
ఈ నేపథ్యంలో జార్ఖండ్‌లోని రాంచీ సీబీఐ ప్ర‌త్యేక కోర్టు జ‌డ్జి శనివారం వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా శిక్ష‌ ఖ‌రారు చేశారు. లాలూ ప్ర‌సాద్ యాద‌వ్‌కి మూడున్నరేళ్ల జైలు శిక్షతో పాటు ఐదు లక్షల జరిమానా విధిస్తున్నట్లు జడ్జి తీర్పు వెల్లడించారు.


Widgets Magazine
Widgets Magazine

దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

ఉత్తర కొరియా క్షిపణి ప్రయోగం విఫలం.. ద.కొరియాతో చర్చలు?

ఉత్తర కొరియా క్షిపణి ప్రయోగం విఫలమైంది. హ్వాసాంగ్-12 అనే మధ్యంతర క్షిపణి తన ...

news

ఖబడ్దార్ చంద్రబాబు... పురంధరేశ్వరి ఆసక్తికర వ్యాఖ్యలు

ఏపీలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల్లో కేంద్రం ఇచ్చే నిధులే 75 శాతానికి పైగా ఉన్నాయి. ...

news

పెళ్లి కుదిర్చారు... కానీ పెళ్లికి ముందే ఏకాంతంగా కనబడ్డారని చంపేశారు...

మానవ విలువలకు ఏమాత్రం స్థానం వుండదు పాకిస్తాన్ దేశంలో. అక్కడ ఎవడు ఎలా అనుకుంటే అలా ...

news

ఈ శునకానికి తెలివి ఎక్కువ (వీడియో)

పెంపుడు జంతువుల్లో ఒకటైన శునకాలను విశ్వాసానికి మారుపేరు చెప్తారు. ఆ శునకాలు మానవుని భాషను ...