గడ్డి స్కామ్‌లో లాలూ ప్రసాద్‌ దోషి : సీబీఐ స్పెషల్ కోర్టు తీర్పు

శనివారం, 23 డిశెంబరు 2017 (15:58 IST)

lalu prasad

దేశాన్ని ఓ కుదుపు కుదిపిన పశుగ్రాసం కుంభకోణం కేసులో ఆర్జేడీ అధినేత, బీహార్ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ దోషిగా తేలారు. ఈ మేరకు రాంచీలోని సీబీఐ ప్రత్యేక కోర్టు శనివారం తీర్పునిచ్చింది. అలాగే, మాజీ ముఖ్యమంత్రి జగన్నాథ్ మిశ్రాతో పాటు ఏడుగురిని నిర్దోషులుగా కోర్టు ప్రకటించింది.  
 
ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ బీహార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 1991–94 కాలంలో దియోగఢ్ ‌(ప్రస్తుతం జార్ఖండ్‌లో ఉంది) ట్రెజరీ నుంచి దాణా కోసం రూ.89 లక్షలకుపైగా అక్రమంగా డ్రా చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులోనే లాలూ ప్రసాద్ యాదవ్ దోషిగా తేలారు. 
 
దీంతో లాలూ సహా మొత్తం 38 మందిపై సీబీఐ 1997, అక్టోబర్‌ 27న చార్జిషీట్‌ దాఖలుచేసింది. ఈ కేసు విచారణ జరుగుతున్న కాలంలో 11 మంది చనిపోగా, ముగ్గురు అప్రూవర్లుగా మారిపోయారు. మిగిలిన వారంతా శనివారం కోర్టుకు హాజరయ్యారు. 
 
ఈ కేసులో సీబీఐ ప్రత్యేక కోర్టు శనివారం తీర్పునిచ్చింది. తీర్పు సందర్భంగా తన కుమారుడు తేజస్వీ యాదవ్‌తో కలిసి సీబీఐ ప్రత్యేక కోర్టుకు వచ్చిన లాలూ ప్రసాద్‌కు ఊరట లభించలేదు. లాలూ ప్రసాద్ యాదవ్‌కు శిక్ష కాలాన్ని జనవరి మూడో తేదీన ఖరారు చేస్తామని న్యాయమూర్తి ప్రకటించారు. దీనిపై మరింత చదవండి :  
Convicted Jail Punishment January 3 Lalu Prasad Yadav Fodder Scam Verdict Live

Loading comments ...

తెలుగు వార్తలు

news

రోజాను అనవసరంగా రొంపిలోకి దింపా... ఏం చేయాలో అర్థంకావడంలేదు : ఎంపి సంచలన వ్యాఖ్యలు

వైసిపి ఎమ్మెల్యే రోజాపై చిత్తూరు ఎంపి శివప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఏ ...

news

బూటు కాలితో తన్నడం సరే.. వీడియో ఎవరు తీశారో తేలుస్తాం : డీసీపీ విశ్వప్రతాప్

విచారణ నిమిత్తం స్టేషన్‌క పిలిచి లఘు చిత్ర దర్శకుడు యోగిని మాదాపూర్ అడిషినల్ డీసీపీ ...

news

నయనతార పేరు చెప్పగానే చొంగ కార్చుకుంటూ వచ్చాడు... వలలో పడ్డాడు...

సినిమా హీరోయిన్లు పేర్లు చెప్పినా, వారి ఫోటోలను చూసినా చాలామంది మహా ఇష్టాన్ని ...

news

ఆ హీరోయిన్ నన్ను రెచ్చగొట్టింది... అందుకే ఆ పని చేశానంటున్న డైరెక్టర్

బుల్లితెర ఇండస్ట్రీ షార్ట్ ఫిలిమ్ డైరెక్టర్‌ యోగిని డీసిపి గంగిరెడ్డి కాలితో తన్నడం ...