Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

బెంగళూరులో కొత్త సంవత్సర వేడుకలు.. ఓ గ్రూపు నడిరోడ్డుపై ఓ అమ్మాయిని?

మంగళవారం, 16 జనవరి 2018 (15:13 IST)

Widgets Magazine

కొత్త సంవత్సర వేడుకలు ఐటీ రాజధాని నగరం బెంగళూరులో అట్టహాసంగా జరుగుతాయి. టెక్కీలతో పాటు ప్రజలంతా పండగ చేసుకుంటారు. కానీ అర్థరాత్రి పూట జరిగే కొత్త సంవత్సర ఆహ్వాన వేడుకలు మాత్రం నేరాల సంఖ్యను పెంచేస్తున్నాయి. గత ఏడాది బెంగళూరులో ఓ యువతిని నలుగురైదుగురు యువకులు నడిరోడ్డుపై లైంగికంగా వేధించిన సంగతి తెలిసిందే. ఈ వివాదం అప్పట్లో సంచలనం సృష్టించింది. 
 
ఇదే తరహాలో 2018 కొత్త సంవత్సర వేడుకల నాడు రోడ్లపై బెంగుళూరు యువకులు ఓవరాక్షన్ చేశారు. వీధుల్లో వికృతంగా నృత్యాలు చేయ‌డ‌మే కాకుండా అడ్డం వ‌చ్చిన వారిని చిత‌క‌బాది పంపారు. రోడ్ల‌పై అమ్మాయిల‌ను వేధిస్తూ... హింసిస్తూ చాలా సార్లు పోలీసుల‌కు కూడా చిక్కారు. 
 
ఈ క్రమంలో డిసెంబర్ 31 రాత్రి రోడ్ల‌పై అక్క‌డి యువ‌కులు చేసిన పోకిరీ చేష్ట‌లు సీసీ కెమెరా దృశ్యాల ద్వారా ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. సీసీ కెమెరాల దృశ్యాల ఆధారంగా మంగళవారం ప‌లువురు యువకులపై కేసులు న‌మోదు చేసిన‌ పోలీసులు ఆ వీడియోను మీడియాకు ఇచ్చారు. 
 
ఈ వీడియోలో కొత్త సంవత్సర వేడుకల సందర్భంగా ఓ గ్రూపు నడి రోడ్డుపై ఎంజాయ్ చేస్తోంది. ఆ దారిలో ఓ బైకుపై ఇద్ద‌రు యువ‌కులు, ఓ అమ్మాయి వెళుతుండ‌గా వారిని ప‌ట్టుకుని చిత‌క్కొట్టారు. ఈ వీడియోలో ఓవరాక్షన్ చేసిన నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

టీ కప్పులో తుఫానులా సుప్రీం వివాదం... జడ్జీల మధ్య సయోధ్య

యావత్ దేశ ప్రజలను దిగ్భ్రమకు గురిచేసిన సుప్రీంకోర్టు వివాదం టీ కప్పులో తుఫానులా ...

news

అవినీతి అధికారుల చిట్టా నావద్ద ఉంది.. మరో భారతీయుడినవుతా... కమల్

ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాకుండానే ఒక యాప్‌ను తయారుచేసి ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు ...

news

జన్మభూమిని మరిచిపోయిన వారు మనుషులే కాదు: చంద్రబాబునాయుడు

చిత్తూరు జిల్లా నారావారిపల్లిలో పలు అభివృద్థి కార్యక్రమాలను ప్రారంభించారు ముఖ్యమంత్రి ...

news

అమ్మోరు జాతరలో అమ్మాయిల న్యూడ్ డాన్సులు

గ్రామ దేవత జాతర పేరుతో అమ్మాయిలు అర్థనగ్న డాన్సులు వేశారు. అదీకూడా పండగ పూట ఈ పాడు పని ...

Widgets Magazine