శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By CVR
Last Updated : మంగళవారం, 28 జులై 2015 (14:57 IST)

ఆధ్యాత్మిక గురువులతోనూ సత్సంబంధాలు కలిగిన కలాం..

భారతరత్న, మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం సైంటిస్ట్‌గానే కాక, రాష్ట్రపతిగానూ దేశానికి ఎనలేని సేవలు అందించారు. సైంటిస్ట్‌గా అంతర్జాతీయ స్థాయిలో శాస్త్రవేత్తలతోను, రాష్ట్రపతిగా రాజకీయ నేతలతో మంచి సంబంధాలను కలిగిన అబ్దుల్ కలాం ఆధ్యాత్మికు గురువులతోనూ సత్సంబంధాలను కలిగి ఉన్నారు. ప్రముఖ ఆధ్యాత్మిక గురువు పుట్టపర్తి భగవాన్ సత్యసాయిబాబాతో సహా దేశంలోని పలువురు ఆధ్యాత్మిక గురువులను కలిశారు. 
 
తమిళనాడు రాష్ట్రంలోని రామేశ్వరం సమీపంలో ఉన్న ఒక చిన్న గ్రామంలో నిరుపేద కుటుంబంలో పుట్టిన ఏపీజే అబ్దుల్ కలాం పట్టుదల, కఠిన శ్రమతో ఉన్నత శిఖరాలను అధిరోహించారు. సైంటిస్ట్‌గాను, రాష్ట్రపతిగాను అబ్దుల్ కలాం భారత దేశానికి ఎనలేని సేవలను అందించి యావత్ భారతం అభినందించే స్థాయికి చేరుకున్నారు.