శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : ఆదివారం, 23 అక్టోబరు 2016 (09:56 IST)

బీజేపీకి శివసేన షాక్... గోవా అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిపోరు

భారతీయ జనతా పార్టీకి శివసేన తేరుకోలేని షాకిచ్చింది. వచ్చే యేడాది జరిగే గోవా అసెంబ్లీ ఎన్నికల్లో శివసేన ఒంటరిగా పోటీ చేయనుంది. ఈ ఎన్నికల్లో ఆర్‌ఎస్ఎస్ బహిష్కృత నేత సుభాష్ వెలింగ్‌కర్ నేతృత్వంలోని గోవా

భారతీయ జనతా పార్టీకి శివసేన తేరుకోలేని షాకిచ్చింది. వచ్చే యేడాది జరిగే గోవా అసెంబ్లీ ఎన్నికల్లో శివసేన ఒంటరిగా పోటీ చేయనుంది. ఈ ఎన్నికల్లో ఆర్‌ఎస్ఎస్ బహిష్కృత నేత సుభాష్ వెలింగ్‌కర్ నేతృత్వంలోని గోవా సురక్షా మంచ్‌తో కలిసి పోటీ చేయాలని శివసేన నిర్ణయించింది. ప్రస్తుతం గోవాలో పర్యటిస్తున్న శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రేనే స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు. 
 
అసెంబ్లీ ఎన్నికలకు ఇంచా చాలా సమయం ఉన్నందుకు సీట్ల సర్దుబాటుపై ఓ అంతిమ నిర్ణయానికి రాలేదని, ఈ అంశంపై త్వరలోనే చర్చలు జరుపుతామని తెలిపారు. కాగా, మహారాష్ట్రలో కూడా అధికార బీజేపీతో అంతంత మాత్రమే సంబంధాలు నెరుపుతున్న శివసేన గోవాలో అయితే ఏకంగా పోటీకే దిగుతోంది. మనోహర్ పారికర్ రక్షణమంత్రిగా వెళ్లినప్పటి నుంచీ గోవాలో బీజేపీకి ఆకర్షణీయ నేత లేకుండా పోవడం బీజేపీకి మైనస్ పాయింట్‌గా మారింది.