శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : బుధవారం, 17 డిశెంబరు 2014 (20:52 IST)

గూగుల్ ఇండియా శోధనల జాబితా: సన్నీ ఫస్ట్, మోడీ నెక్ట్స్!

గూగుల్ ఇండియా శోధనల జాబితాలో బాలీవుడ్‌కు దిగుమతి అయిన సన్నీ లియోన్ తొలి స్థానాన్ని కైవసం చేసుకుంది. ఈ ఏడాది గూగుల్ ఇండియా శోధనల జాబితాలో సన్నీ లియోన్ టాప్‌లో నిలిచింది. ఈ జాబితాలో ఈసారి రెండు కొత్త విషయాలు తెలిశాయి. 
 
ఒకటి, యూజర్లు తాము తెలుసుకోవాల్సిన వాటి గురించి నేరుగా టైప్ చేయకుండా 'యూఆర్ఎల్' అడ్రస్ బార్ ద్వారా వెతుకుతున్నారట. రెండోది, బీజేపీ స్టార్ ప్రచారకర్త, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభావం ఉన్నప్పటికీ... శృంగార తార సన్నీ లియోన్ గురించే ఇంకా గూగుల్లో వెతుకులాడారాని తెలియవచ్చింది. 
 
ఈ క్రమంలో గూగుల్ ఇండియా జాబితాలో మోడీ ద్వితీయ స్థానంలో ఉండగా, బాలీవుడ్‌కు దిగుమతైన సన్నీ లియోన్ తొలి స్థానాన్ని ఆక్రమించింది. ఇక తరువాత స్థానాల్లో సల్మాన్ ఖాన్, కత్రినాకైఫ్, దీపికా పదుకొనె ఉన్నారు.