శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By CVR
Last Updated : మంగళవారం, 21 ఏప్రియల్ 2015 (12:30 IST)

'హిందీ దివస్' పురస్కారాల పేర్లు మార్పు.. తొలగిన ఇందిరా, రాజీవ్‌ల పేర్లు..!

భాషాభివృద్ధి ఉపయోగార్ధం 'హిందీ దివస్' రోజున కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందించే అవార్డుల పేర్లు మారాయి. కేంద్ర ప్రభుత్వం ఇటీవల రెండు అవార్డుల పేర్లను మార్చింది. హోం శాఖ ఆదేశాల ప్రకారం ఇన్నేళ్లు అందిస్తున్న 'ఇందిరా గాంధీ రాజభాష పురస్కార్' అవార్డును ఇకపై 'రాజభాష కీర్తి పురస్కార్'గా పిలువనున్నారు.
 
అదే విధంగా 'రాజీవ్ గాంధీ రాష్ట్రీయ గ్యాన్-విజ్ఞాన్ మౌలిక్ పుస్తక్ లేఖన్ పురస్కార్' అవార్డును ఇక నుంచి  'రాజభాష గౌరవ్ పురస్కార్' అనే పేరుతో ప్రధానం చేయనున్నారు. ఈ అవార్డుల పేర్లు 2015 మార్చి 25 నుంచి అమల్లోకి రానున్నట్టు హోం శాఖ ఆదేశంలో తెలిపింది. కాగా పురస్కారాల పేర్లు మార్చడంపై ప్రతిపక్ష కాంగ్రెస్ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.