శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : శనివారం, 2 ఆగస్టు 2014 (13:51 IST)

ముంబైలో పచ్చి మిర్చి ఘాటు: కేజీ రూ.120 అట!

టమోటాల ధరలు అమాంతంగా పెరిగిపోతున్నాయి. ఇప్పుడు మిర్చి ఘాటు కూడా పెరిగిపోతోంది. ముంబయిలో పచ్చిమిరపకాయలు కేజీ రూ.120 పలుకుతున్నాయట. మహారాష్ట్రలోని బుల్దానా ప్రాంతం మిర్చి పంటకు ప్రసిద్ధి. అయితే, వర్షాభావం కారణంగా పంట ఆశించిన స్థాయిలో లేదు.

దీంతో, అక్కడి నుంచి సరఫరా తగ్గడంతో రేట్లు పెరిగిపోయాయి. కొంతకాలం నుంచి ముంబయి మార్కెట్ వర్గాలు కర్ణాటకలోని హవేరి ప్రాంతం నుంచి మిర్చిని దిగుమతి చేసుకుంటుండగా, అక్కడ భారీవర్షాల కారణంగా రైతులు ఈ పంటకు దూరంగా ఉన్నారు. 
 
తాజాగా, అక్కడి నుంచి 14 ట్రక్కులు మాత్రమే మిర్చి లోడుతో ముంబయికి చేరుకున్నాయి. కానీ, నగర వాసుల అవసరాల దృష్ట్యా 30 ట్రక్కుల మిర్చి అయితేగానీ సరిపోదట. దీనికితోడు ఎడతెగని వర్షాలతో సరుకు దెబ్బతినడం కూడా మిర్చి ధరల పెంపునకు కారణమని మార్కెట్ వర్గాలు తెలిపాయి.