శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : గురువారం, 2 జూన్ 2016 (17:59 IST)

గుల్బర్గ్ సొసైటీ నరమేథం కేసు: బిపిన్ పటేల్‌‌తో పాటు 24 మంది దోషులు

గోద్రా అల్లర్ల మరుసటి రోజు సంభవించిన గుల్బర్గ్ సొసైటీ నరమేథం కేసులో అహ్మదాబాద్ కోర్టు దోషులను ప్రకటించింది. ఈ కేసులో 24 మందిని దోషులుగా కోర్టు నిర్ధారించింది. బీజేపీ నేత బిపిన్ పటేల్‌ను ప్రధాన నిందితుల్లో ఒకరుగా కోర్టు నిర్ధోషిగా ప్రకటించింది. ఈ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం 66 మందిని నిందితులుగా పేర్కొంది. ఈ 66 మందిలో క్రుట 24 మందిని దోషులుగా నిర్ధారించింది. 
 
మిగిలిన 36 మందిని నిర్ధోషులుగా వదిలిపెట్టింది. కాగా గుజరాత్‌లో 2002లో చోటుచేసుకున్న ఈ నరమేథంలో కాంగ్రెస్ ఎంపి ఎహ్సాన్ జాఫ్రీ సహా 69 మంది మృతిచెందిన సంగతి తెలిసిందే. పలువురిని సజీవదహనం చేశారు. జాఫ్రీని బయటకు ఈడ్చుకొచ్చి చంపి తగలబెట్టారు. 77ఏళ్ల వయస్సులో జాఫ్రీ భార్య జకియా జాఫ్రీ అనార్యోగంతోనూ మరోవైపు తనకు జరిగిన అన్యాయంతోనూ ఇప్పటికీ పోరాడుతూనే ఉన్నారు.