శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శనివారం, 10 జూన్ 2017 (10:48 IST)

తల్లిపై అత్యాచారం... వీడియో తీసి కుమార్తెను భయపెట్టి రేప్... ఎక్కడ?

దేశ రాజధాని న్యూఢిల్లీకి కూతవేటు దూరంలో ఉండే గుర్గావ్‌లో మరో దారుణం జరిగింది. ఓ వివాహితను అత్యాచారం చేసిన ఓ కామాంధుడు.. తాను చేసిన నిర్వాకాన్ని వీడియో తీశాడు. ఆ వీడియోను సోషల్ మీడియాలో అప్‌‍లోడ్ చేస్త

దేశ రాజధాని న్యూఢిల్లీకి కూతవేటు దూరంలో ఉండే గుర్గావ్‌లో మరో దారుణం జరిగింది. ఓ వివాహితను అత్యాచారం చేసిన ఓ కామాంధుడు.. తాను చేసిన నిర్వాకాన్ని వీడియో తీశాడు. ఆ వీడియోను సోషల్ మీడియాలో అప్‌‍లోడ్ చేస్తానంటూ బెదిరించి... ఆ వివాహిత కుమార్తెపై కూడా రేప్ చేశాడు. గుర్గావ్‌లో జరిగిన ఈ దారుణ వివరాలను పరిశీలిస్తే... 
 
గుర్గావ్‌కు చెందిన ఓ వితంతువు 15 యేళ్ళ కుమార్తె, 11 యేళ్ళ కుమారుడితో కలిసి నివసిస్తోంది. ఈమెకు 25 రోజుల కిందట అశిష్ అనే వ్యక్తి పరిచయమయ్యాడు. ఆ తర్వాత అమె ఇంటికి వెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. పలుమార్లు అత్యాచారం జరిపి వీడియో తీశాడు. 
 
దాన్ని ఇంటర్నెట్‌లో అప్‌లోడ్‌ చేస్తానని భయపెట్టి కుమార్తెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అయితే, ఈ కామాంధుడి వేధింపులు శృతిమించడంతో ఆ వితంతువు పోలీసులను ఆశ్రయించింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు.. కామాంధుడిని అరెస్టు చేశారు.