Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ఢిల్లీ యువతులా మజాకా.. పోకిరీలపై చెప్పులతో దాడి చేశారు.. వీడియో వైరల్..

సోమవారం, 12 జూన్ 2017 (17:45 IST)

Widgets Magazine

ఢిల్లీలో మహిళలపై అకృత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. అయితే వీటికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదని ఆరోపణలు వస్తున్నాయి. అయితే ఢిల్లీ శివారులోని గురుగ్రామ్‌లో పలువురు యువతులు పోకిరీలకు గట్టిగా బుద్ధి చెప్పారు. తద్వారా మహిళలు తమకు తామే రక్షణగా మారిపోవాలని ఈ ఘటన ద్వారా సందేశమిచ్చారు. వివరాల్లోకి వెళితే.. ఎంజీ రోడ్‌ ప్రాంతంలో రాత్రి ఒంటిగంటకు నైట్‌క్లబ్స్‌లో పని చేస్తున్న కొంతమంది అమ్మాయిలు ఇంటికి బయల్దేరారు. 
 
రోడ్డుపైకి వచ్చిన ఈ అమ్మాయిలను నలుగురు యువకులు వేధించాలనుకున్నారు. వారు అసభ్య పదజాలం వాడటంతో ఆ యువతులు హెచ్చరించారు. దీంతో అక్కడ నుంచి వెళ్ళిపోయిన ఆ యువకులు తమ వెంట పదిమందితో వచ్చి అమ్మాయిలను చుట్టుముట్టారు. వారిలో ఒకమ్మాయిని బలవంతంగా లాక్కెళుతుండగా.. మిగిలిన యువతులంతా ఏకమయ్యారు. 
 
చెప్పులతో యువకులపై దాడి చేశారు. దీంతో ఆ యువకులంతా పారిపోయారు. ఇంత జరుగుతున్నా.. ఎవరూ యువతులను కాపాడలేదు. అంతేగాక‌, త‌మ సెల్‌ఫోన్‌ల‌తో ఆ దృశ్యాల‌ను చిత్రీక‌రించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

డా॥ సి నారాయణరెడ్డి మృతికి మంత్రి అఖిలప్రియ సంతాపం

అమరావతి : ప్రముఖ సాహితీవేత్త, జ్ఞానపీఠ అవార్డు గ్రహీత డాక్టర్ సింగిరెడ్డి నారాయణ రెడ్డి ...

news

అయ్యా... మీరు ఒకే అనండి.. రెచ్చిపోతానంటున్న తమిళ నేత ఎవరు?

తమిళనాడు రాజకీయాలు ఇప్పుడు శశికళ మేనల్లుడు టి.టి.వి. దినకరన్ చుట్టూనే తిరుగుతున్నాయి. ...

news

దీప తప్పు కదూ.. అన్నతో అలా... మోడీ వద్దకు పంచాయతీ

తమిళనాట రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. రజినీకాంత్ పార్టీ పెడతారని ఒకవైపు, దినకరన్ ...

news

రాష్ట్రపతి అభ్యర్థిగా వెంకయ్యనాయుడు...?

వెంకయ్యనాయుడు. పెద్దగా పరిచయం లేని వ్యక్తి. నెల్లూరు జిల్లాలో సాధారణ కార్యకర్తగా రాజకీయ ...

Widgets Magazine